Watch Video: రైలు పట్టాలపై రీళ్లు చేయడానికి వెళ్లిన వ్యక్తి ఏమయ్యాడో తెలుసా? భయంకరమైన వీడియో వైరల్‌..

|

Nov 25, 2023 | 7:02 PM

ఈ భయానక, షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ బాలుడు రీళ్లు తయారు చేసేందుకు రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతికి సంబంధించిన చివరి క్షణాలను అతని స్నేహితులు మొబైల్‌లో బంధించారు. కేవలం 5 సెకన్ల ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఇలాంటి వెర్రి సాహసాలను ఎవరూ ప్రయత్నించకూడదని చాలా మంది నెటిజన్లు సూచిస్తున్నారు.

Watch Video: రైలు పట్టాలపై రీళ్లు చేయడానికి వెళ్లిన వ్యక్తి ఏమయ్యాడో తెలుసా? భయంకరమైన వీడియో వైరల్‌..
Teen Creating Reels On Rail
Follow us on

సోషల్ మీడియాలో ఓవర్ నైట్ పాపులర్ కావడానికి, రీల్స్ క్రేజ్ ను అలవర్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. రీల్స్ మోజులో పడి చాలా మంది ఎక్కువ వ్యూస్‌ కోసం ఆరాటపడుతూ..ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువ లైక్‌ల కోసం రీల్స్‌ చేయడానికి వెర్రి సాహసాలు చేస్తూ ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తున్నారు. అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలు పట్టాలపై రీళ్లు వేయడానికి వెళ్లిన 14 ఏళ్ల బాలుడు మృత్యుఒడిలోకి చేరిన విషాద సంఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలపై పడుకుని రీళ్లు వేయబోతుండగా అకస్మాత్తుగా రైలు ఢీకొని బాలుడు మృతి చెందాడు. మృతుడు ఫర్మాన్‌గా గుర్తించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో చోటుచేసుకుంది.

ఈ భయానక, షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ బాలుడు రీళ్లు తయారు చేసేందుకు రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతికి సంబంధించిన చివరి క్షణాలను అతని స్నేహితులు మొబైల్‌లో బంధించారు.

ఇవి కూడా చదవండి

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని జ‌హంగీర్ బాద్ తేరా దౌల‌త్‌పూర్‌లో నివాసం ఉంటున్న బాలుడు ఫెర్మాన్‌ కాస్త మతిస్థిమితం లేకుండా ఉండేవాడు. అయితే, ఫర్మాన్ తన స్నేహితులతో కలిసి రీల్స్ చేయడానికి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. కదులుతున్న రైలును గమనించకుండా హీరోలా రీల్స్ తీయటం కోసం పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ, పాపం అలా వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లుగా వీడియో చూస్తే అర్థమవుతుంది.  రైలు ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే, కేవలం 5 సెకన్ల ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఇలాంటి వెర్రి సాహసాలను ఎవరూ ప్రయత్నించకూడదని చాలా మంది నెటిజన్లు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..