HBD Sourav Ganguly: కుమార్తెతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన దాదా.. నెట్టింట వైరల్ వీడియో

|

Jul 08, 2022 | 5:52 PM

ప్రస్తుతం సౌరవ్ గంగూలీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, తన కుమార్తె, సన్నిహితులతో కలిసి లండన్ వీధుల్లో సందడి చేశాడు.

HBD Sourav Ganguly: కుమార్తెతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన దాదా.. నెట్టింట వైరల్ వీడియో
Sourav Ganguly Dance
Follow us on

భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈరోజు తన 50వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దాదా పుట్టినరోజు సందర్భంగా లండన్‌లో కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. గంగూలీ పుట్టినరోజు వేడుకలు ప్రారంభమైన వెంటనే, అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు లండన్‌ వీధుల్లో సందడి చేశారు. ఈ మేరకు గంగూలీ డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఈ వీడియోలో గంగూలీ కుమార్తె సనా కూడా ఉంది. దీంతో ఈ వీడియోలను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు.

కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో సౌరవ్ గంగూలీ, అతని సన్నిహితులు కొన్ని ప్రముఖ బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. వీడియోలో, గంగూలీ కుమార్తె సనా, భార్య డోనా కూడా అతనితో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. గంగూలీ జీవితంలోని ఈ స్పెషల్ డేను మరింత గుర్తుండిపోయేలా చేసేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, గంగూలీ మాంచి ఊపులో చిందులేశాడు. తలపై టోపీ పెట్టుకుని బూడిదరంగు జాకెట్, జీన్స్ ధరించి ఉన్నాడు. ‘పురా లండన్ తిర్కడ’, షారుఖ్ ఖాన్ ఫేమస్ సాంగ్ ‘దీవాంగి… దీవాంగి… దీవాంగి… హై’ పాటలకు అదిరిపోయే స్టెప్పులేశాడు.