Viral Video: వారెవ్వా ఏం టెక్నాలజీ గురూ.. ఇలా చెబితే న్యూస్‌ అసలు బోరే కొట్టదు..

Viral Video: రోజురోజుకీ పెరిగిపోతున్న టెక్నాలజీ మానవ జీవితాన్ని పూర్తి మార్చేస్తోంది. ఆగ్మెంటెడ్‌ రియాలీ, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఇలా కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతికత విప్లవాత్మక మార్పులకు దారి తీస్తోంది...

Viral Video: వారెవ్వా ఏం టెక్నాలజీ గురూ.. ఇలా చెబితే న్యూస్‌ అసలు బోరే కొట్టదు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 08, 2022 | 6:01 PM

Viral Video: రోజురోజుకీ పెరిగిపోతున్న టెక్నాలజీ మానవ జీవితాన్ని పూర్తి మార్చేస్తోంది. ఆగ్మెంటెడ్‌ రియాలీ, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఇలా కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతికత విప్లవాత్మక మార్పులకు దారి తీస్తోంది. ప్రస్తుతం ప్రతీ రంగంలో టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. పెరుగుతోన్న పోటీని తట్టుకునే క్రమంలో సంస్థలు సైతం కొత్త టెక్నాలజీని అడప్ట్‌ చేసుకుంటున్నారు. దీనికి మీడియా సంస్థలు కూడా అతీతులేం కాదు. అందరూ చెప్పే వార్తలను తాము ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా న్యూస్‌ ప్రజెంటేషన్‌లో మార్పులు చేస్తున్నారు.

సాధారణంగా వార్తలు చూడడాన్ని కేవలం పెద్దలు మాత్రమే ఇష్టపడుతుంటారు. యంగ్‌ జనరేషన్‌ న్యూస్‌ను కాస్త తక్కువగానే చూస్తారనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వస్తోన్న ఆంగ్మెంటెడ్‌ రియాలిటీతో యువత కూడా న్యూస్‌ చూడడానికి ఆసక్తి చూపుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన దగ్గర ఇప్పుడిప్పుడే కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. అయితే విదేశాల్లో మాత్రం ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రతీ అంశాన్ని 3డీ టెక్నాలజీ సహాయంతో నిజంగా స్టూడియోలోనే జరుగుతుందా అనే భ్రమ కలిగించేలా న్యూస్‌ ప్రజెంటేషన్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి న్యూస్‌ ప్రజెంటేషన్‌కు సంబంధించిన ఓ ఓ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఫిగెన్‌ అనే నెటిజన్‌ పోస్ట్‌ చేసిన ట్వీట్‌లో న్యూస్‌ ప్రజెంటేషన్‌ కోసం ఉపయోగించిన టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే. వర్షాలు, యుద్ధాలు, వాహనాలు ఇలా ప్రతీ అంశాన్ని 3డీ టెక్నాలజీలో న్యూస్‌ ప్రజెంటర్‌ వివరిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. మన దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి టెక్నాలజీ వస్తే జనాలు న్యూస్‌ ఛానల్స్‌ను కళ్లప్పగించి చూస్తారనడంలో ఎలాంటి సందేహం ఉండదు కదూ.!

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?