
Viral Video: బాల్యంలో మనమంతా స్నేహితులు, ఉపాధ్యాయులతో కలిసి రకరకాల చిలిపి పనులు చేసే ఉంటాం. అయితే, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలా మంది ఉపాధ్యాయులు కూడా పిల్లల్లాగే చిలిపి పనులు చేయడం ప్రారంభించారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఓ టీచర్ ఓ స్టూడెంట్ తో చాలా ఫన్నీగా కనిపించింది. ఈ వీడియో చివరలో ఎవరూ ఊహించనిది చోటు చేసుకుంది. దీంతో ఫ్రాంక్ చేద్దామనుకున్న లేడీ టీచర్ కూడా బలైంది. దీంతో క్లాస్ అంతా నవ్వుల్లో మునిగిపోయింది.
ఒక నాణెం సీసా కింద పెట్టి, ఆ నాణెం సీసా లోపల ఉందని అవతలి వ్యక్తిని నమ్మించే ట్రెండ్ కొనసాగింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి సీసాలోకి చూస్తుండగా అవతలి వ్యక్తి ఒక్కసారిగా బాటిల్ ను వత్తేస్తాడు. దీంతో అందులోని వాటర్ అంతా సదరు వ్యక్తి ముఖాన్ని తడిపేస్తుంది. తాజాగా లేడీ టీచర్ కూడా తన స్టూడెంట్స్ తో ఇలాంటిదేదో చేయాలని ఆలోచించింది. వారితో ఇలాంటి ఆట ఆడింది. దీన్ని చూసి అందరూ నవ్వుతున్నారు. అందుకే ఈ వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోలో లేడీ టీచర్ తరగతి గదిలో తన డెస్క్ మీద కూర్చుని చేతిలో నీళ్ల బాటిల్ పట్టుకుని ఉండటం చూడొచ్చు. ఒక అమాయక స్టూడెంట్ ఆమె ముందు నిలబడి ఉన్నాడు. మేడమ్ నవ్వుతూ బాటిల్ లోపలికి చూడమని అతన్ని అడుగుతుంది. ఆ పిల్లవాడు కూడా పూర్తి నమ్మకంగా, ఉత్సుకతతో బాటిల్ వైపు వాలి చూస్తాడు. మేడమ్ ఒక మ్యాజిక్ ట్రిక్ చూపించబోతున్నట్లుగా అతని ముందు తన చేతులను ఊపుతుంది.
टेक्नॉलॉजी के नए दौर में ये मास्टरनी जी भी उलझ गए 😅 pic.twitter.com/DRkKYRvG7n
— सुनील चौधरी जोधपुर (@ErSunilGugarwal) September 14, 2025
ఆ సీసాలోకి తీక్షణంగా చూస్తుండగా, అకస్మాత్తుగా, టీచర్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని బాటిల్ ను గట్టిగా వత్తేసింది. మరుసటి క్షణం బాటిల్ లో వాటర్ వేగంగా స్టూడెంట్ ముఖంపై పడ్డాయి. ఇక్కడ తమాషా ఏమిటంటే, బాటిల్ నుంచి వచ్చిన నీరు పిల్లవాడిపై పడటమే కాకుండా, లేడీ టీచర్ ను కూడా తడిపేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి తరగతిలోని మిగతా పిల్లలు నవ్వుల్లో మునిగిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..