Viral Video: స్టూడెంట్స్‌తో కలిసి డాన్స్ చేసిన అందాల టీచరమ్మ.. ఫైర్ అవుతోన్న నెటిజన్లు

|

Dec 04, 2022 | 8:22 PM

పిల్లలో ఆసక్తి కలిగించడానికి ఇలా టీచర్లు డాన్స్ చేసిన వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

Viral Video: స్టూడెంట్స్‌తో కలిసి డాన్స్ చేసిన అందాల టీచరమ్మ.. ఫైర్ అవుతోన్న నెటిజన్లు
Teacher
Follow us on

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. మొన్నటి వరకు టిక్ టాక్ అంటూ యువత నానా రచ్చ చేశారు. ఇక ఇప్పుడు ఆ టిక్ టాక్ పోవడంతో ఇన్‌స్టా‌గ్రామ్ పైన పడ్డారు అందరు. చిత్ర విచిత్రమైన వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే కొంతమంది టీచర్లు పిల్లలు పాఠాలు చెప్పడానికి పాటలు, పడుతూ ఉంటారు. పిల్లలో ఆసక్తి కలిగించడానికి ఇలా టీచర్లు డాన్స్ చేసిన వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో తరగతి గదిలో పిల్లల ముందు ఒక టీచర్ భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేసింది ఈ వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.

ట్రేండింగ్ లో ఉన్న వీడియోకు ఆ అందాల టీచరమ్మ డాన్స్ చేస్తుంటే విద్యార్థులు కూడా స్టెప్పులేశారు. ఈ డ్యాన్స్‌లో టీచర్, పిల్లలు ఇద్దరూ ఆనందంగా పాల్గొన్నారు. ఈ టీచర్ పాట్లీ కమారియా మోరీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే ఈ వీడియో పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కేవలం రీల్స్ కోసమే ఈ వీడియో తీశాడని, అందుకే ఆమెను సస్పెండ్ చేయాలని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోను 26,000 మందికి పైగా చూశారు. టీచర్ అసభ్యకరంగా డ్యాన్స్ చేసిందని నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలి.. పిల్లల ముందు ఇలాంటి నృత్యాలు మంచిది కాదని, ఉపాధ్యాయ వృత్తికే అవమానం అని కొందరు అంటున్నారు. మరికొందరు ఆ టీచర్ ను సమర్థిస్తున్నారు. క్లాస్‌లో ఐటమ్ డాన్స్ చేయాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మంలో గురువుల పట్ల గొప్ప గౌరవం ఉండేది. నేటి ఉపాధ్యాయులు దీన్ని నిలబెట్టుకుని పిల్లలకు కూడా నేర్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..