కొంతమంది విద్యార్థులు, టీచర్లతో సరదాగా ఉంటారు. మరికొందరూ విద్యార్థులైతే వివిధ కారణాల ఏకంగా టీచర్లతోనే గొడవ పడుతుంటారు. అమెరికాలోని నాష్‌విల్లిలోని ఓ హైస్కూల్ చదువుతున్న విద్యార్థిని తన టీచర్‌పైనే కోపంతో పెప్పర్ స్ప్రే కొట్టింది. వివరాల్లోకి వెళ్తే ఆ విద్యార్థులకు ఆ టీచర్ ఓ వర్క్ చేయమని ఇచ్చాడు. కానీ ఆ యువతి మాత్రం సమాధానాల కోసం తన ఫోన్‌తో గూగుల్ సెర్చ్ చేసింది. ఇది గమనించిన ఈ టీచర్ ఆమె ఫోన్‌ను లాక్కున్నాడు. వెంటనే ఆ గదిలోనుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో ఆ యువతి ఆ టీచర్‌ను ఫాలో అవుతూ బయటకు వచ్చింది. తన ఫోన్ తిరిగివ్వాలంటూ అడిగింది. ఇందుకు ఆ టీచర్ ఒప్పుకోకపోవడంతో వెంటనే అతని మోహంపై తన చెతిలో ఉన్న పెప్పర్ స్ప్రేను కొట్టింది.
ఆ తర్వాత ఆమె టీచర్ నుంచి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించింది. కానీ ఆ టీచర్ మాత్రం ఫోన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు భిన్నరీతిలో స్పందిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం అదే టీచర్‌ను ఓ విద్యార్థి మోహంపై కొట్టాడంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
What’s going on with these kids??
She pepper sprayed her teacher for taking her phone… pic.twitter.com/vShD30Msum
— King Roy (@RoyIsThaTruth) May 7, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..