Viral: ఎందుకూ పనికిరావన్న టీచర్ కు స్టూడెంట్ దిమ్మతిరిగే రిప్లై.. రివేంజ్ మామూలుగా లేదుగా

|

Jul 27, 2022 | 4:03 PM

సమాజంలో ఉపాధ్యాయ (Teacher) వృత్తి ఎంతో పవిత్రమైనది. మెరుగైన, ప్రశాంతమైన, స్నేహపూర్వక సమాజం కోసం మొదటి అడుగు వేసేది టీచరే. విద్యార్థులను మంచి మార్గంలో నడిపించి, వారి అభివృద్ధికి బాటలు వేస్తూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు...

Viral: ఎందుకూ పనికిరావన్న టీచర్ కు స్టూడెంట్ దిమ్మతిరిగే రిప్లై.. రివేంజ్ మామూలుగా లేదుగా
stuent
Follow us on

సమాజంలో ఉపాధ్యాయ (Teacher) వృత్తి ఎంతో పవిత్రమైనది. మెరుగైన, ప్రశాంతమైన, స్నేహపూర్వక సమాజం కోసం మొదటి అడుగు వేసేది టీచరే. విద్యార్థులను మంచి మార్గంలో నడిపించి, వారి అభివృద్ధికి బాటలు వేస్తూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు అహర్నిశలు కష్టపడుతుంటారు. విద్యార్థులు విజయంలోనే తమ గెలుపును చూసుకుని మురిసిపోతారు. అయితే.. టీచర్లు అన్నాక క్లాస్ లోని అందరూ పిల్లల పట్ల ఒకే రకంగా ప్రవర్తించారు. పాఠశాలలో (School) వివిధ రకాల మనస్తత్వాలు, అభిప్రాయాలు కలిగిన విద్యార్థులు ఉంటారు. వారిలో బాగా చదివే వారు, అస్సలు చదవని వారు, నేర్పిస్తే నేర్చుకునే వారు ఇలా రకరకాలుగా ఉంటారు. వారందరి పట్ల ఉపాధ్యాయుడు బేధాభిప్రాయాలు చూపించకుండా అందరూ ఒకటేనన్న భావన కల్పించాలి. కానీ ఓ టీచర్ మాత్రం.. ఇందుకు భిన్నంగా ప్రవర్తించింది. తన క్లాస్ లోని ఓ విద్యార్థిని బాగా చదవకపోవడంతో ఆమె ఎప్పుడూ అలాగే ఉండిపోతుందని చెప్పంది. టీచర్ మాటలను ఛాలెంజ్ తీసుకున్న ఆ విద్యార్థిని కొన్నేళ్ల తర్వాత సదరు టీచర్ కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాను పదో తరగతిలో ఉన్న సమయంలో ఓ టీచర్ తనతో నిరుత్సాహంగా వ్యవహిరించిందని, తనను బాగా హర్ట్ చేసిందని మెసేజ్ ద్వారా వెల్లడించింది. తాజాగా తాను ఇంటర్మీడియెట్ పరీక్షలూ పాసయ్యానని, తనకు నచ్చిన యూనివర్సిటీలో నచ్చిన కోర్సులో చేరానని మెసేజ్ పంపించింది. తనకు చదువు చెప్పినందుకు థాంక్స్‌ చెప్తూ ఈ మెసేజ్ చెయ్యడం లేదని, భవిష్యత్తులోనైనా విద్యార్థుల పట్ల దయగా వ్యవహరించాలని టీచర్ కు సజేషన్ చేసింది. ఈ వాట్సాప్ చాట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..