
ఈ భూమిపై అనేక రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి. ప్రతిదానికీ దాని స్వంత ప్రత్యేకత, లక్షణాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు అన్ని జీవుల నిర్మాణం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్నింటి గురించి మనకు తెలిసి ఉంటుంది. మరికొన్నింటి గురించి తెలిసి ఉండక పోవచ్చు. అప్పుడప్పుడు అలాంటి వింత జీవులు వెలుగులోకి వస్తూ మనుషుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి వింత సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. పాంబన్ నదిలో వేటకు వెళ్లిన ఓ జాలరి వలలో విచిత్ర చేప చిక్కింది.
తమిళనాడులోని పాంబన్ జాలర్ల వలకు ఒక వింత చేప చిక్కింది. ఆ చేప సుమారు 8 కిలోల బరువుందని మత్స్యకారులు చెప్పారు. అయితే, ఈ చేపకు విచిత్రంగా తోక లేకుండా రెక్కలాంటి శరీరంతో కనిపించింది. దీన్ని చూసిన మత్స్యకారులు ఒకింత ఆశ్చర్యపోయారు. కానీ, ఈ చేపని సన్‌ఫిష్ అంటారని తెలిసింది. ఈ చేప అరుదైనదని శాస్త్రవేత్తలు తెలిపారు. తోక లేకుండా రెక్కలాంటి శరీరంతో ఉండే ఈ జలచరం.. ఎక్కువగా తూర్పు పసిఫిక్ మహా సముద్రంలో కనిపిస్తుందని చెప్పారు. ఈ చేప 200 నుంచి 600 మీటర్ల లోతులో తిరుగుతూ… రోజుకు 26 కి.మీ. వరకు ఈదగలదని వారు వివరించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..