8 ఏళ్ల కోటీశ్వరుడు పెళ్లయిన కొన్ని గంటలకే చనిపోయాడు. అతను ఇంకా హైస్కూలులో చదువుతున్నాడు. కోట్లాది ఆస్తిని వారసత్వంగా పొందాడు. ఈ క్రమంలోనే అతడు మరో అబ్బాయిని పెళ్లిచేసుకున్నాడు. కానీ, వివాహం జరిగిన రెండు గంటల తర్వాత అతడు తను ఉంటున్న అపార్ట్‌మెంట్ కిందే శవమై కనిపించాడు. తన కొడుకు రెండుసార్లు మాత్రమే కలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడని, తన కొడుకు మరణం వెనుక పలు అనుమానాలు ఉన్నాయంటూ మృతుడి తల్లి కన్నీరుమున్నీరవుతోంది. మృతుడు లైగా గుర్తించారు. ఈ విషాద సంఘటన తైవాన్‌లో చోటు చేసుకుంది. మృతుడు సెంట్రల్ తైవాన్‌లోని తైచుంగ్ నగరంలో నివసిస్తున్నాడు. తన మరణానికి కొద్దిరోజరుల ముందుగానే అతను తన తండ్రి నుండి 13.11 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 134 కోట్లు) ఆస్తిని వారసత్వంగా పొందాడు. మే 4న అతని మృతదేహం అపార్ట్‌మెంట్ బయట పడిఉండటం కనిపించింది. అతను ఈ భవనంలోనే నివసించేవాడని చెబుతున్నారు. అదే సమయంలో అత డి మరణానికి రెండు గంటల ముందు తను 26 ఏళ్ల వ్యక్తి హాసియాని వివాహం చేసుకున్నట్టుగా గుర్తించారు.
కాగా, కొడుకు మరణం తట్టుకోలేక మృతుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన కుమారుడి మరణం వెనుక కుట్ర ఉందని లై తల్లి చెన్ ఆరోపించింది. తన కొడుకు స్వలింగ సంపర్కుడని చెప్పింది. అతని తండ్రి ఏప్రిల్ చివరిలో మరణించాడని, ఆస్తి సంబంధిత పత్రాల తయారీ, అవసరమైన ఫైళ్ల నిర్వహణ హసియా చూసుకునేవాడని చెప్పింది. ఈ క్రమంలోనే లై హాసియాను రెండుసార్లు మాత్రమే కలిశాడని చెప్పింది.
అయితే, లై మరణించిన రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామనే నెపంతో హాసియా అతడిని తన వెంట తీసుకెళ్లిందని చెప్పింది.. ఆ తరువాతే, హసియా లై వివాహం కోసం నమోదు చేసుకున్నట్లు తెలిసింది. కానీ, రెండు గంటల తర్వాత చెన్ తన కొడుకు మరణ వార్తను విన్నానంటూ వాపోయింది. తన కుమారుడి ఆత్మహత్యకు గల కారణాలు బయటపెట్టాలని తల్లి డిమాండ్ చేసింది. తన ఆస్తి కారణంగానే లై హత్యకు గురయ్యాడని అతని లాయర్ వాదించాడు. ఈ క్రమంలోనేక హసియాపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోంది.
విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. హాసియా, లై తండ్రికి పాత సంబంధం ఉందని, అటువంటి పరిస్థితిలో, లై హసియాను రెండుసార్లు మాత్రమే కలిశాడని తేలింది. ఈ సమావేశాలలో ఒకటి అతని తండ్రి మరణం తర్వాత జరిగిందని నిర్ధారించారు. లై హత్య అనుమానం నిర్ధారణ కావడంతో హసియాను జైల్లో పెట్టారు కానీ, ఆ తరువాత £7,865 (సుమారు రూ. 8 లక్షలు) బెయిల్‌పై విడుదల చేశారు. రెండోసారి హాసియా, ఆమె తండ్రిని ఐదు గంటల పాటు విచారించారు. అదే సమయంలో లై పోస్ట్‌మార్టం రిపోర్టు ఆధారంగా కేసు పురోగతి ఉండనుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..