Shocking News: ఒక చిన్న గిన్నె వారి జీవితాన్నే మార్చేసింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.. ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..

Shocking News: అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపుతడుతుందట.. అదే దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుందట. అయితే, ఈ జంట తమ ఇంటి డోర్‌ను అదృష్టం తట్టడమే..

Shocking News: ఒక చిన్న గిన్నె వారి జీవితాన్నే మార్చేసింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.. ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..
Old Bowl
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 18, 2021 | 3:26 PM

Shocking News: అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపుతడుతుందట.. అదే దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుందట. అయితే, ఈ జంట తమ ఇంటి డోర్‌ను అదృష్టం తట్టడమే ఆలస్యం తెరిచినట్లున్నారు. అందుకే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. అసలు ఎందుకూ పనికి రాదని మూలకు పెట్టిన గిన్నె.. ఏకంగా వారిపై కోట్ల రూపాయల కాసుల వర్షం కురిపించింది. ఈ ఘటన స్విట్జర్లాండ్‌ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే.. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ జంట ఒక రోజు మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ వారి కళ్లు పాత గిన్నె పై పడ్డాయి. దానిపై ఆసక్తికరమైన డిజైన్ ఉంది. అది వారికి ఎంతగానో నచ్చింది. ఆ గిన్నెను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. దుకాణదారుడు కూడా ఆ గిన్నెను పనికిరానిదిగా భావించి.. అతి తక్కువ ధరకే వారికి విక్రయించాడు. అయితే, ఆ గిన్నె వారి జీవితాన్ని మార్చేస్తుందని ఆ సమయంలో వారు కూడా ఊహించి ఉండకపోవచ్చు.

ఇదీ గిన్నె ప్రత్యేకత… ఈ గిన్నెను కొనుగోలు చేసిన తర్వాత దంపతులు తమ ఇంటికి చేరుకున్నారు. దానిని నిశితంగా పరిశీలించిన వారు.. అది పురాతన గిన్నెగా భావించి దానిని వేలం వేయాలని నిర్ణయించుకున్నారు. అనేక ప్రదేశాలలో దానిని వేలానికి పెట్టారు. అయితే, దానిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పనికిరాని గిన్నె అని అందరూ దానిని కొనేందుకు విముఖత వ్యక్తం చేశారు. దాంతో ఇది నిజంగానే స్క్రాప్ అని భావించిన ఆ జంట.. ఇంట్లోనే ఓ మూలకు పడేశారు. టెన్నిస్ బంతులను నిల్వ చేయడానికి ఉపయోగించారు. కొన్ని రోజులు అలా గడిచిపోయింది. గిన్నె గురించి ఆ దంపతులు పూర్తిగా మర్చిపోయారు. ఇంతలో ఒకరోజు వారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది.

వేలం వేసే నిపుణుడు వారికి ఫోన్ చేసి.. గిన్నె కు సంబంధించిన సమాచారంపై ఆరా తీశాడు. ఆ తరువాత నేరుగా ఇంటికి వచ్చాడు. గిన్నె ప్రత్యేకతను వారికి వివరించాడు. ఈ గిన్నె 17వ శతాబ్దానికి చెందినదని, దీనిని చైనా రాజు ఉపయోగించారని వారికి తెలిపాడు. నిపుణులు దానిని వేలానికి పెట్టగా.. అది ఏకంగా రూ.34.5 కోట్లు(భారత కరెన్సీలో) పలికింది. కేవలం పదుల రూపాయలు మాత్రమే వెచ్చించి కొనుగోలు చేసిన ఈ గిన్నె.. వారిని ఏకంగా కోటీశ్వరులను చేసింది. వాస్తవానికి ఈ వార్త 2019లో జరిగింది. అయితే, ప్రస్తుతం మళ్లీ ఈ జంట ట్రెండింగ్‌గా నిలిచింది. మరోసారి ఈ గిన్నె వైరల్ అవుతోంది.

Also read:

Vizianagaram: మొదట ‘అయ్యా’ అంటూ దొంగ బాబా కాళ్లు మొక్కారు.. తర్వాత ‘నీ అయ్య’ అంటూ బెండుతీశారు

Afghanistan Crisis: ఆఫ్ఘన్ పరిణామాలపై వ్యూహాత్మకంగా వేచి చూసే ధోరణిలో భారత్.. పరిస్థితి ప్రమాదకరమే అంటున్న కాంగ్రెస్!

Bheemla Nayak : భీమ్లా నాయక్ నుంచి మరో సర్‌‌‌ప్రైజ్ రానుందట.. ఈ సారి దగ్గుబాటి హీరో వంతు..

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్