Viral: మళ్లీ మెరిసిన జాతిరత్నాలు.. ఈ ఆన్సర్స్ చూస్తే మీకు నవ్వాగదు.. నెక్ట్స్ లెవల్

ఎగ్జామ్స్ సమయంలో జాతిరత్నాలు రాసిన ఫన్నీ ఆన్సర్స్ సైతం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. మాములుగా ప్రతి క్లాసులో ఇలాంటివారు ఉంటారు. ఇచ్చిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే ఏదో ఒక సోది రాసి ఆన్సర్ షీట్ నింపేస్తారు.

Viral: మళ్లీ మెరిసిన జాతిరత్నాలు.. ఈ ఆన్సర్స్ చూస్తే మీకు నవ్వాగదు.. నెక్ట్స్ లెవల్
Funny Answers
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 15, 2022 | 9:50 PM

Trending: సోషల్ మీడియా(Social Media)లో ఫన్ కంటెంట్ రోజూ వైరల్ అవుతూ ఉంటుంది. రకరకాలు వీడియో క్లిప్స్, రిజైన్ లెటర్స్, లీవ్ లెటర్స్, పోస్టులు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో మీమ్స్(memes) ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మీమ్ పేజీలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు పరీక్షల్లో ప్రశ్నలకు తమకు ఆన్సర్స్ రానప్పుడు రాసే ఇస్మార్ట్ ఆన్సర్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇచ్చిన ప్రశ్నకు.. ఆన్సర్ తెలియకపోతే అలా వదిలేయకుండా తమ పైత్యాన్ని ఉపయోగించి ఆన్సర్ షీట్ నింపేస్తారు కొందరు జాతిరత్నాలు. ఇలాంటి వాళ్లు అన్ని క్లాసుల్లో ఉంటూనే ఉంటారు. అలా అని వారిని తక్కువ చేయాల్సిన పనిలేదండి. ఎందుకంటే  బ్యాక్ బెంచ్ నుంచి వచ్చినవారే ఎక్కువగా క్రియేటివ్ ఫీల్డ్‌లో రాణిస్తున్నారనడానికి బయట ప్రపంచంలో ఎన్నో ఉదాహారణలు ఉన్నాయి. తాజాగా ఇద్దరు ఆనిముత్యాలు ఎగ్జామ్స్‌లో రాసిన ఆన్సర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. స్కూల్‌లో ఉన్నప్పుడు ఏవైనా రెండు నంబర్స్ ఇచ్చి అందులో ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పమని గ్రేటర్ దన్.. లెస్ దన్ సింబల్స్‌ ఇచ్చి గుర్తించమని అడిగేవారు. కానీ క్వశ్చన్ పేపర్‌లొ ఈ క్వశ్చన్ చూసి ఓ విద్యార్థి రాసిన ఆన్సర్‌కి చూసి టీచర్ మైండ్ బ్లాంక్ అయ్యింది.  అదే క్రమంలో మరో విద్యార్థి 1896లో ఏం ముగిసింది అని యుద్ధం గురించి రాయమంటే… 1895 ముగిసింది అని సమాధానం రాశాడు. ఇది చూశాక ఆ టీచర్ మంచి గిఫ్ట్(పనిష్మెంట్) ఇచ్చే ఉంటారు కదా..!. ప్రజంట్ ఈ ఫన్నీ ఆన్సర్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  ‘వీళ్లే అసలైన జాతిరత్నాలు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

Funny Answers

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..