British pilgrim: 6,500 కిలోమీటర్లు నడిచి మక్కా చేరుకున్న భక్తుడు.. దాదాపు 11నెలల పాటు..
భక్తులు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోడానికి తీర్థయాత్రలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు కాలి నడకన ఆ దైవసన్నిథికి చేరుకుంటామని మొక్కుకుంటారు. హిందువుల్లో
భక్తులు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోడానికి తీర్థయాత్రలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు కాలి నడకన ఆ దైవసన్నిథికి చేరుకుంటామని మొక్కుకుంటారు. హిందువుల్లో ఇది సర్వసాధారణం. కానీ ఓ ముస్లిం భక్తుడు కాలినడకన మక్కా మసీదు దర్శనానికి వెళ్లాడు. అందుకు అతను ఏకంగా 6,500 కిలోమీటర్లు నడిచాడు. తన జీవితాశయాన్ని నెరవేర్చుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే…ఇంగ్లండ్‌కు చెందిన 52 ఏండ్ల ఆడం మొహమ్మద్ హజ్ యాత్రలో భాగంగా మక్కా చేరుకోవాలనుకున్నాడు. ఇంగ్లండ్‌లోని వాల్వర్‌హాంప్టన్‌లో అతను గతేడాది ఆగస్టు 1న పాదయాత్ర మొదలుపెట్టాడు. అలా 6,500 కిలోమీటర్లు నడిచి మక్కాను చేరుకున్నాడు. అతడి ప్రయాణంలో భాగంగా నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్, జోర్డాన్‌ల మీదుగా నడిచాడు. మక్కా చేరుకునేందుకు అతడికి మొత్తంగా 10 నెలల 25 రోజులు పట్టింది. ప్రతి రోజూ సగటున 17 కిలోమీటర్లు నడిచేవాడు. ప్రయాణం పొడవునా అతడు..ఇస్లామిక్ పారాయణాలు పఠించాడు. ప్రయాణంలో అవసరమయ్యే వస్తువులను మోసుకెళ్లేందుకు ఇంట్లో సొంతంగా ఓ బండిని తయారుచేసుకున్నాడు. దాని బరువు 300 కేజీలు. దానికి స్పీకర్లు కూడా అమర్చుకున్నాడు. ఇక అక్కడికి చేరుకున్న తర్వాత మంత్రి మాజిద్ బిన్ అబ్దుల్లా అల్ కసాబి ఇతనికి ఆతిథ్యం ఇచ్చి హజ్ పర్మిట్‌ను ఇప్పించారు. అయితే..తాను ఈ పని కీర్తి కోసమో, డబ్బు కోసమో చేయలేదని, జాతి, మతం, రంగు వంటి భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటేనని ప్రపంచానికి చాటడానికే ఈ యాత్ర చేశానని చెప్పాడు ఆడం. ఇస్లాం బోధించే శాంతి, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడమే తన పర్యటన లక్ష్యం’ అని వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..