Watch: ఆకాశంలో ఎగిరే సైకిల్.. ! ఇంజనీరింగ్‌ విద్యార్థి అద్భుత సృష్టి.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

నేటి యువతరం ఆలోచనలకు ఆకాశమే హద్దు.. తాజాగా, ఒక విద్యార్థి చేసిన ఆవిష్కరణ అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను ఎలాంటి ఇంజిన్, ఇంధనం లేకుండా విమాన ప్రయాణాన్ని పరిచయం చేశాడు. సైకిల్ పెడల్‌ని బలంగా తొక్కుతూ విమానంలాంటి వాహనంలో ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch: ఆకాశంలో ఎగిరే సైకిల్.. ! ఇంజనీరింగ్‌ విద్యార్థి అద్భుత సృష్టి.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Human Powered Flight

Updated on: Nov 10, 2025 | 12:04 PM

నేటి వేగవంతమైన ప్రపంచంలో,ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు ప్రతిచోటా ఉన్నాయి. ఎగిరే సైకిల్ తొక్కుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా పెను తుఫాను సృష్టిస్తోంది. ఈ వీడియోలో ఒక యువకుడు ఎగిరే సైకిల్‌ను తయారు చేశాడు.. సైకిల్ పెడల్‌ లాంటివి తొక్కుతూ అతడు ఎలా ఎగిరిపోతున్నాడో ఈ వీడియోలో స్పష్టం చూపించాడు. ఈ వీడియోను @Enezator అనే వినియోగదారు సోషల్ మీడియా సైట్‌లో షేర్ చేశారు.

షేర్ చేసిన ఈ వీడియో శీర్షికలో ఒక విద్యార్థి వాస్తవానికి మనిషి స్వయం శక్తితో పెడలింగ్‌తో తొక్కుతూ ఎగిరే సైకిల్‌ను సృష్టించాడని పేర్కొంది. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. ఈ అద్భుతమైన సాంకేతికతను చూసిన తర్వాత ప్రజలు చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. వీడియోలో, ఆకాశంలో ఎగురుతున్న సైకిల్ సాధారణ సైకిల్ కాదు..దానికి పెద్దసైజులో భారీ రెక్కలు ఉన్నాయి. అవి తేలికపాటి ఫ్రేమ్‌తో తయారు చేసినట్టుగా వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. దానికి వెనుక భాగంలో ఒక పెద్ద ఫ్యాన్ కూడా ఉంది. ఇది పెడల్ తొక్కినప్పుడు వేగంగా తిరుగుతుంది. ఆ వ్యక్తి ఎంత వేగంగా పెడల్ తొక్కుతున్నాడో అంతే వేగంగా విమానం ఎత్తుకు ఎగురుతుంది.

ఇవి కూడా చదవండి

వీడియో

ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. ఒకరు వీడియోపై స్పందిస్తూ..పెడలింగ్ ఆపేస్తే ఆ వెంటనే కింద పడిపోతారా అని అడుగుతున్నారు. ఇలాంటి అనేక ప్రశ్నలు చాలా మంది కామెంట్‌ బాక్స్‌లో అడుగుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..