అమ్మ లేకుండా ఎలా?..కటౌట్ సాక్షిగా గ్రాడ్యుయేషన్ పట్టా!
అమ్మ..ప్రతి మనిషికి మొదట పలకరించి..చివరివరకు వెంటాడే ఎమోషన్. మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు మొదట సంతోషించేది…ఫెయిల్యూర్స్‌లో తొలిగా బాధపడేది తనే. లైఫ్‌లో బిగ్గెస్ట్ మూమెంట్స్ అన్నీ అమ్మనాన్నలతోనే షేర్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. అలానే ఓ విద్యార్థి తన లైఫ్‌లో మెమెరబుల్ డే మూమెంట్ అయిన గ్రాడ్యవేషన్ పట్టా అందుకున్నాడు. అయితే అమ్మ గతంలోనే చనిపోవడంతో ..ఆమె కటౌట్ సాక్షిగా పట్టాను అందుకున్నాడు. వివర్లాలోకి వెళ్తే.. అలిసాంగ్ ఫౌల్ జాన్ అనే విద్యార్థి ఫిలిపిన్స్ యూనివర్శిటీకి చెందిన లైసియంలో […]

అమ్మ..ప్రతి మనిషికి మొదట పలకరించి..చివరివరకు వెంటాడే ఎమోషన్. మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు మొదట సంతోషించేది…ఫెయిల్యూర్స్‌లో తొలిగా బాధపడేది తనే. లైఫ్‌లో బిగ్గెస్ట్ మూమెంట్స్ అన్నీ అమ్మనాన్నలతోనే షేర్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. అలానే ఓ విద్యార్థి తన లైఫ్‌లో మెమెరబుల్ డే మూమెంట్ అయిన గ్రాడ్యవేషన్ పట్టా అందుకున్నాడు. అయితే అమ్మ గతంలోనే చనిపోవడంతో ..ఆమె కటౌట్ సాక్షిగా పట్టాను అందుకున్నాడు.
వివర్లాలోకి వెళ్తే.. అలిసాంగ్ ఫౌల్ జాన్ అనే విద్యార్థి ఫిలిపిన్స్ యూనివర్శిటీకి చెందిన లైసియంలో చదువు కంప్లీట్ చేశాడు. గ్రాడ్యూయేషన్ పట్టా అందుకొనేప్పుడు తన తల్లి పక్కన ఉండాలని కోరుకున్నాడు. ఆమె కోరిక కూడా కొడుకు బాగా చదువుకోని ఉన్నత స్థాయికి వెళ్లాలని.. అయితే, అతడి తల్లి 2016లో అనారోగ్యంతో చనిపోయింది. దీంతో అలిసాంగ్ తన తల్లి కటౌట్‌తోనే వేడుకలో పాల్గొన్నాడు. అనంతరం ఆ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ‘‘అమ్మా, నువ్వు కోరుకున్నట్లే గ్రాడ్యూయేషన్ పూర్తిచేశాను. నువ్వు సంతోషిస్తావని భావిస్తున్నాను’’ అని తెలిపాడు. దీంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

