సోషల్ మీడియాలో ప్రతినిత్యం రకరకాల మీమ్స్ వైరల్ అవుతుంటాయి. ఆ మీమ్స్ చూడటానికి మాత్రమే కాదు.. చదవటానికి భలేగా ఫన్నీగా అనిపిస్తాయి. అసలు వాటిని క్రియేట్ చేసేవారి క్రియేటివిటీని మెచ్చుకోవాల్సిందే. పక్కవారిని చాలా నీట్‌గా రోస్ట్ చేయడంతో ఈ మీమర్స్‌కి ఎవ్వరూ సాటిలేరని చెప్పొచ్చు. ఇక్కడ మరీ ఫన్నీ థింగ్ ఏంటంటే.? కొందరు కొన్ని ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు మరీ నాటీగా ఉంటాయి. ఇటీవల ఓ పిల్లాడు డాక్టర్ అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఆ ఆన్సర్ చూసి టీచర్ కూడా స్టన్ అవ్వడం ఖాయం. ఓ నెటిజన్ ఈ ఫన్నీ ఆన్సర్‌ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ ఆన్సర్ షీట్‌లో ఏముందంటే.?
ఇది చదవండి: టిక్.. టాక్.. టిక్..! ఈ ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
Q: డాక్టర్ అంటే ఎవరు.? అనే ప్రశ్నకు ఆ విద్యార్ధి క్రియేటివిటీతో ఫన్నీ ఆన్సర్ రాశాడు.
A: డాక్టర్ అంటే.. పిల్స్‌తో మీ జబ్బులను చంపి, ఆ తర్వాత బిల్స్‌తో మిమ్మల్ని చంపే వ్యక్తి అని రాసుకొచ్చాడు.
Itna sach bro 😭 pic.twitter.com/Ws0XicKEOD
— Vishal (@VishalMalvi_) December 22, 2024
ఇది చదవండి: ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్ పెట్టండి.. నేచురల్ టిప్స్
ఈ సమాధానం చూసి టీచర్ కొంచెం అయోమయానికి గురైనట్టు ఉంది. ఏం చేయాలో తెలియక చివరికి 5/5 మార్కులు వేసింది. ప్రస్తుతం ఈ ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఆ ప్రశ్నకు అంతకుమించిన జవాబు లేదు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇది నిఖార్సైన ఆన్సర్‌రా బేటా’ అని ఇంకొకరు చెప్పుకొచ్చారు. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓ లుక్కేయండి.
ఇది చదవండి: ఇదేం లొల్లిరా.. శోభనం రాత్రి వధువు వింత కోరికలు.. దెబ్బకు బిత్తరపోయిన వరుడు
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి