
మన పరిసరాల్లో చలాకీగా తిరుగుతూ ఉండే చిరు జీవులు ఉడుతలను చూసే ఉంటారు. అయితే ఈ చిన్న జీవులు పాముల కంటే ప్రమాదకరమైనవని బహుశా ఎవరూ ఊహించనైనా ఊహించి ఉండరు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉడుతకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది నిజమేనా అని నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఈ వీడియోలో ఒక ఉడుత పాము లాంటి విష జీవిని సజీవంగా నమిలి తింటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉడుతను ఒక సాదు జీవిగా భావించిన ప్రజలు.. ఈ ఉడుత అసలు రూపాన్ని చూసి షాక్ అవుతున్నారు. ఇది నిజమేనా అని ఆలోచిస్తున్నారు.
వీడియోలో ఎండిన ఆకుల మధ్య ఒక పాము పాకుతూ ఉంది. అకస్మాత్తుగా ఒక ఉడుత కనిపించింది. సాధారణంగా చిన్న చిన్న జీవులు పాములు అంటే భయపడి పారిపోతాయి.. అయితే ఈ ఉడుత చాలా భిన్నంగా ఉంది. ఇది పాముపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించింది. కొద్దిసేపటికే ఉడుత పాముపై తన ఆధిక్యం ప్రదర్శించి దానిని నమలడం ప్రారంభించింది. ఈ దృశ్యం అసలు ఊహించనిది. చూస్తున్నవారు తమ కళ్ళను తామే నమ్మడం కష్టం. మానవుడు లేదా జంతువు అయినా ఎవరినీ బలహీనులుగా పరిగణించకూడదని ఈ సంఘటన రుజువు చేస్తుంది.
ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @AmazingSights అనే ఖాతా షేర్ చేసింది. “ఉడుత పామును చంపి తింటుంది” అనే క్యాప్షన్‌తో. దాదాపు ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోను 29,000 కంటే మంది చూశారు. వందలాది మంది ఇష్టపడ్డారు. వివిధ రకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
వీడియో చూసిన తర్వాత ఒక యూజర్ ఇలా వ్రాశాడు.. పాములకు భయపడేవారు ఇకపై ఉడుతలను చూసి కూడా భయపడాల్సి ఉంటుంది.” మరొకరు “ఈ ఉడుతను ‘అడవి సింహం అని పిలవాలి.” ఇంత చిన్న జీవికి పాములాంటి విష జీవిని బతికి ఉండగానే తినడానికి ధైర్యం ఎలా వచ్చిందో అంటూ చాలామంది ఆశ్చర్యపోయారు.
A chipmunk takes down a snake and then eats it pic.twitter.com/j0CqWouQLd
— Potato (@MrLaalpotato) September 16, 2025
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..