వీడురా కొడుకంటే.! తల్లిని కలను నెరవేర్చాడు.. కట్ చేస్తే 13 వేల అడుగుల ఎత్తులో స్కై డైవింగ్..!
కొంతమందికి వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే. వారు ఏ వయసులోనైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కేరళకు చెందిన 71 ఏళ్ల వృద్ధురాలిని చూడండి..! ఆమె 13,000 అడుగుల ఎత్తు నుండి స్కైడైవింగ్ చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన రికార్డును సృష్టించింది. ఆమె ఇప్పుడు 13,000 అడుగుల ఎత్తు నుండి స్కైడైవింగ్ చేసిన అతి పెద్ద వయసు కలిగిన మహిళగా నిలిచారు.

కొంతమందికి వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే. వారు ఏ వయసులోనైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కేరళకు చెందిన 71 ఏళ్ల వృద్ధురాలిని చూడండి..! ఆమె 13,000 అడుగుల ఎత్తు నుండి స్కైడైవింగ్ చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన రికార్డును సృష్టించింది. ఆమె ఇప్పుడు 13,000 అడుగుల ఎత్తు నుండి స్కైడైవింగ్ చేసిన అతి పెద్ద వయసు కలిగిన మహిళగా నిలిచారు. ఈ వృద్ధ మహిళ సంవత్సరాలుగా ఈ కలను నెరవేర్చుకోవాలనుకుంది. చివరకు అది తన కొడుకు రూపంలో నిజమైంది.
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కొన్నతడి ప్రాంతానికి చెందిన లీలా జోస్.. సాహసోపేత ప్రయాణాలకు నిర్దిష్ట వయస్సు లేద నిరూపించారు. లీలా జోస్ తన నగరంపైన ఆకాశంలో ఎగురుతున్న విమానాలను చూసినప్పుడు, ఆమె అలా ఎగరాలని కోరుకుంది. ఆమె తన ఇరుగు పొరుగు మహిళలతో స్కైడైవింగ్ ఎంత సరదాగా ఉంటుందో.. దానిని కూడా ప్రయత్నించాలనుకుంటున్నానని చెప్పింది. ఆ మహిళలు ఆమెను ఎగతాళి చేయడం ప్రారంభించారు. అయితే, లీలా జోస్ వారి వ్యాఖ్యలను పట్టించుకోలేదు. తన కలను సజీవంగా ఉంచుకుంది.
లీల జోస్ గత నెలలోనే సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన కొడుకును చూడటానికి దుబాయ్ వెళ్లింది. ఈ పర్యటనలో, ఆమె తన కలను నెరవేర్చుకునే అవకాశం లభించింది. ఆమె తన కొడుకుకు స్కైడైవ్ చేయాలనే కోరిక గురించి చెప్పింది. కానీ అతను మొదట ఆమె జోక్ చేస్తున్నారని అనుకున్నాడు. తన కొడుకు తనను వృద్ధురాలిగా భావించాడని, కానీ ఆమె సీరియస్‌గా ఉందని గ్రహించినప్పుడు, ఆమె కోరికలను గౌరవించి, ఆమెను స్కైడైవింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడని లీల జోస్ వివరించింది.
కుమారుడు అనిష్ దుబాయ్ స్కైడైవింగ్ బృందంతో టెన్డం జంప్ బుక్ చేసుకున్నాడు. 71 ఏళ్ల వృద్ధురాలు తమను స్కైడైవింగ్‌కు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. అనిష్ స్కైడైవింగ్ బృందంతోపాటు వీడియోగ్రఫీ కోసం దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. తన తల్లి సంతోషం కోసం మరపురాని జ్ఞాపకాన్ని అందించాడు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
