Viral Video: ఆకాశంలో ‘జెల్లీ ఫిష్’ని మీరెప్పుడైనా చూశారా.? వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..

|

May 09, 2022 | 8:08 AM

మే 5 ఉదయం, జార్జియాలోని వేక్రాస్‌లో ఆకాశంలో కదులుతున్న ఒక రహస్య వస్తువు కనిపించింది. ఇది తెల్లిన ఆకారంలో ఉంది. అలాగే పదునైన మెరిసే వస్తువులా కనిపించింది. అయితే, ఇది ఖచ్చితంగా స్పేస్ జెల్లీ ఫిష్ లాగే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఆకాశంలో జెల్లీ ఫిష్ని మీరెప్పుడైనా చూశారా.? వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే..
Space Jellyfish Viral
Follow us on

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. వాటిలో కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. నెటిజన్లకు నచ్చినవి బాగా వైరల్ అవుతుంటాయి. నవ్వించేవే కాదు.. అప్పుడప్పుడూ ఆశ్చర్యపరిచేవి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయనడంలో సందేహం లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. జెల్లీ ఫిష్‌లు సముద్రంలో కనిపిస్తాయని మనకు తెలిసిందే. కానీ, ఆకాశంలో జెల్లీ ఫిష్‌లు మీరు ఎప్పుడైనా చూశారా? అదేంటి ఇలాంటి వింత ప్రశ్న అడుగుతున్నారని చూస్తున్నారా.. అవునండీ.. ఇలాంటి వింత తాజాగా మిస్టీరియస్ స్పేస్ జెల్లీ ఫిష్ దక్షిణ అమెరికాలో కనిపించింది. ఇది చూసి అక్కడి జనాలు అంతా నోరెళ్లబెడుతూ చూస్తుండిపోయారంట. పదండి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..

మే 5 ఉదయం, జార్జియాలోని వేక్రాస్‌లో ఆకాశంలో కదులుతున్న ఒక రహస్య వస్తువు కనిపించింది. ఇది తెల్లిన ఆకారంలో ఉంది. అలాగే పదునైన మెరిసే వస్తువులా కనిపించింది. అయితే, ఇది ఖచ్చితంగా స్పేస్ జెల్లీ ఫిష్ లాగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను శాన్ ఆంటోనియోలోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఏరోడైనమిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ క్రిస్ కాంబ్స్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈమేరకు స్పేస్ జల్లీ ఫిఫ్ అంటూ క్యాఫ్షన్ అందించాడు.

ఇవి కూడా చదవండి

ఈ స్పేస్ జెల్లీ ఫిష్ UFO కాదని క్రిస్ కాంబ్స్ అన్నారు. ఇది కెమెరాకు దాదాపు 250 మైళ్ల (400 కిమీ) దూరంలో ఉన్న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం అంటూ తెలిపాడు. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ రాకెట్లు లాంచ్ ప్యాడ్ నుంచి బయలుదేరుతాయి. అయితే వాటిలో కొన్ని ఆకాశంలో ఇలాంటి ఆకారంలో కనిపిస్తుంటాయంట. కాంబ్స్ ప్రకారం, ఇది ఫిజిక్స్‌తోపాటు పర్ఫెక్ట్ టైమింగ్ కలయికలో ఏర్పడిందని అంటున్నారు. మొదట్లో, ఫాల్కన్ 9 రాకెట్ ఇంజన్ నాజిల్ నుంచి వెలువడే వాయువు నుంచి జెల్లీ ఫిష్ లాంటి ఆకారం వచ్చిందని కాంబ్స్ పేర్కొన్నారు. నాజిల్ లోపల, వెలుపల ఒత్తిడిలో వ్యత్యాసం కారణంగా ఇలా ఉబ్బెత్తు ఆకారం ఏర్పడుతుంది.

ఈ సందర్భంలో, నాజిల్ నుంచి వచ్చే వాయువు తక్కువగా విస్తరిస్తుంది. అంటే ఇంజిన్ నుంచి వచ్చే వాయువు నాజిల్ నుంచి బయటకు వస్తుంది. వాయువు దాని చుట్టూ ఉన్న గాలి కంటే ఎక్కువ ఒత్తిడిలో ఉంటుంది. వాతావరణంలోని ఒత్తిడికి సరిపోలడానికి, రాకెట్ నుంచి విడుదలయ్యే వాయువు నాజిల్ నుంచి నిష్క్రమించేటప్పుడు ఇలా విస్తరిస్తుంది. దాంతో ఒత్తిడిని తగ్గిస్తుంది. అందువలన జెల్లీ ఫిష్ వంటి ఆకారం ఏర్పడుతుంది. గురువారం తెల్లవారుజామున రాకెట్ ప్రయోగం జరిగింది. ఆ సమయంలో సూర్యుని నుంచి వచ్చే కాంతి హోరిజోన్ గుండా ప్రయాణిస్తుంది. అందుకే రాకెట్ నుంచి వెలువడే వాయువు మెరుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Viral Video: అయ్యయ్యో.. ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను.. పాపం పిల్లి..

Bangalore: ఆఫీస్ లో అలా చేసేందుకు అనుమతి.. బంపర్ ఆఫర్ ఇచ్చిన బెంగళూరు స్టార్టప్..