Viral video: గ్రాడ్యూయేషన్‌ డిగ్రీ పొందిన కొడుకు..తల్లి ముందు ఏంచేశాడంటే..వీడియోలో చూడాల్సిందే…

|

May 21, 2022 | 10:10 PM

తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను సంబరాలు చేసుకుంటారు. పిల్లలు చేసిన ప్రతి విజయాన్ని చూసి గర్వపడతారు. పాఠశాల, కళాశాల స్థాయిల్లో పిల్లలు సాధించిన విజయాలను ప్రత్యక్షంగా చూసినప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందం

Viral video: గ్రాడ్యూయేషన్‌ డిగ్రీ పొందిన కొడుకు..తల్లి ముందు ఏంచేశాడంటే..వీడియోలో చూడాల్సిందే...
Son Dedicates
Follow us on

తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను సంబరాలు చేసుకుంటారు. పిల్లలు చేసిన ప్రతి విజయాన్ని చూసి గర్వపడతారు. పాఠశాల, కళాశాల స్థాయిల్లో పిల్లలు సాధించిన విజయాలను ప్రత్యక్షంగా చూసినప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందం అంతా ఇంతా కాదు..అలాంటి వీడియోలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి. వాటిని చూసిన నెటిజన్ల తమ భావోద్వేగాలను కామెంట్ల రూపంలో పంచుకుంటారు. అలాంటి హృదయాన్ని హత్తుకునే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గ్రాడ్యుయేషన్ వేడుకలో కొడుకు తాను అందుకున్న డిగ్రీని తన తల్లికి బహూకరిస్తున్న దృశ్యం వీడియోలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ పేజీ గుడ్‌న్యూస్ మూవ్‌మెంట్‌లో వీడియో విడుదలైంది. సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించిన ఈ వీడియోను ఇప్పటివరకు 3.2 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు.

ఒక కొడుకు తన గ్రాడ్యుయేషన్ డిగ్రీని తన తల్లికి అంకితం చేసిన వీడియో వేలాది మంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఆ యువకుడు తన తల్లికి గ్రాడ్యుయేషన్ క్యాప్ పెట్టి గౌను చుట్టి ఆమెకు కృతజ్ఞతలు తెలిపిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆంటోనియో (@theantoniochavezz) ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేయబడింది. ఒక మెక్సికన్ యువకుడు, తన తల్లికి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌ అంకితం చేశాడు. తల్లికి శాలువా కప్పి సన్మానం చేశాడు. అమ్మ నుదిటిపై అప్యాయంగా ముద్దుపెడతాడు..దాంతో తల్లి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. కళ్లనిండా నిండిన ఆనందబాష్పాలతో కొడుకుని ఆశ్వీరదించింది. కొడుకు సాధించిన విజయాలకు ఆమెలో సంతోషం, గర్వంతో కొడుకును హత్తుకుంది. కొడుకును ముద్దు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పుత్రోత్సాహమూ తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగదు..జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! అన్న పద్యము ఇక్కడ అక్షరాల నిజమైంది అంటూ వీడియోకి కొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు.