Viral Video: నిటారు కొండపై మంచు చిరుతల వేట.. ఈ అద్భుతమైన వీడియోను చూస్తే ఆశ్చర్యపోతారంటే!

|

Aug 28, 2021 | 10:05 AM

Snow Leopard Hunting: ఎత్తైన కొండలపై నివసించే మంచు చిరుతలు.. నీలం రంగు గొర్రెలను ఎక్కువగా వేటాడటాయి. పర్వతాల సమూహంపై వాటి వేట భయానకంగా ఉంటుంది..

Viral Video: నిటారు కొండపై మంచు చిరుతల వేట.. ఈ అద్భుతమైన వీడియోను చూస్తే ఆశ్చర్యపోతారంటే!
Snow Leopards
Follow us on

మీరు చిరుతపులుల గురించి వినే ఉంటారు. అలాగే చిరుత వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు చూసి ఉంటారు. కానీ మీరెప్పుడైనా మంచు చిరుత(Snow Leopard) గురించి విన్నారా.? దాని వేటను చూశారా.? అంతరించిపోతున్న జంతు జాతుల జాబితాలో మంచు చిరుతల జాతి కూడా ఒకటి.

సాధారణంగా మంచు చిరుతలు ఎత్తైన పర్వతాలు, కొండలపై నివసిస్తుంటాయి. తెల్లవారుజామున, సాయంత్రం, రాత్రి సమయాల్లో మంచు చిరుతలు ఎక్కువగా తిరుగుతాయి. ఆయా సమయాల్లో ఇవి నీలి గొర్రెలను వేటాడటాయి. వేగానికి, చురుకుదనానికి మంచు చిరుతలు మారుపేరుగా నిలుస్తాయి. వీటి వేట మిగిలిన క్రూర మృగాలకు ఏమాత్రం తీసిపోదు. ఇక తాజాగా మంచు చిరుతకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ‘Bigcatswildlife’ అనే పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనిని చూసి నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు. నిటారుగా ఉన్న ఓ కొండపై మంచు చిరుత తన ఎరను వేటాడుతుంది. దాని వేట వీక్షకులను అబ్బురపరుస్తోంది. నిటారుగా ఉన్న కొండపై రెండు మంచు చిరుతలు నీలి రంగు గొర్రెలను వేటాడటానికి వెంబడిస్తున్నట్టు మీరు వీడియోలో చూడవచ్చు. అలాంటి కొండలపై నడవడమే కష్టం.. అలాంటిది ఈ చిరుతలు తమ ఎర కోసం పరిగెడుతున్నాయి.

ఏదో సినిమాలో సీన్ చూసినట్లుగా మీకు అనుభూతి కలగవచ్చు. ఈ వీడియోను 21 వేల మందికి పైగా లైక్ చేయగా.. ప్రజలు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అంతేకాకుండా ఆ మంచు చిరుతల వేటకు అందరూ కూడా మంత్రముగ్దులయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి…

ఇవి చదవండి:

రైల్వే ప్రయాణీకులకు కొత్త రూల్స్.. అది తప్పనిసరి..

ఈ రాశులవారు నమ్మదగినవారు కాదు.. సీక్రెట్స్ అస్సలు పంచుకోవద్దు!

అడవి దున్నను నోటకరిచిన సింహం.. వేటలో షాకింగ్ ట్విస్ట్..