Maharashtra:మనం ఇష్టపడే వ్యక్తులు చనిపోతే.. కన్నీటి ధార ఆగదు. బాధలోనూ వారికి ఘనంగా తుది విడ్కోలు పలుకుతాం.. అంత్యక్రియలు నిర్వహిస్తాం.. ఇప్పటివరకు మనతో చాలా రోజులు గడిపిన కుటుంబ సభ్యులు మన నుంచి దూరమవతున్నారన్న బాధ మనల్ని ఎంతగానో కలిచివేస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో జరిగింది. అయితే ఇక్కడ చనిపోయింది మనిషి కాదు. పోలీసు శాఖలో బాంబ్ స్క్వాడ్ బృందంలో సేవలందించిన శునకం ‘రానా’. పూణేలోని శివాజీ నగర్‌లో ‘ఎక్స్‌ప్లోసివ్ డిటెక్షన్ టాస్క్’లో రానా శిక్షణ పొందిందని.. VVIP, VIP బెదిరింపు కాల్స్, యాంటీ యాక్సిడెంట్, పేలుడు సమయాల్లో తనిఖీల్లో ఈ డాగ్ స్వ్కాడ్ విశేష సేవలందించిందని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు.
స్నిఫర్ డాగ్‌గా శిక్షణ పొందిన లాబ్రడార్‌ను 2016లో బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS) లో చేర్చారు. రానా కడుపు సంబంధిత వ్యాధుల కారణంగా జూలై 22 నుండి చికిత్స పొందుతుందని, ముంబైలోని బాయి సకర్బాయి దిన్షా ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు తెలిపారు. పరిస్థితి విషమించడంతో మూడు రోజుల క్రితం ఈశునకం తుది శ్వాస విడించిందని పోలీసు అధికారులు తెలిపారు. ఇటీవల మరణించిన బాంబ్ స్క్వాడ్ డాగ్ ‘రానా’కు ముంబై పోలీసులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. రానాకు విడ్కోలు పలికామని.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించామని ముంబై పోలీసులు తెలిపారు. అంత్యక్రియల కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మినిస్ట్రేషన్), బాంబ్ స్క్వాడ్ సీనియర్ ఇన్‌స్పెక్టర్‌తో సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెస్ట్ ఇన్ పీస్ అంటూ నెటిజన్లు ఈట్వీట్ కు కామెంట్స్ చేస్తున్నారు.
“Rana” Goodbye!
We Bid Adieu to Rana (Labrador) deputed at Bomb Detection & Disposal Squad. The funeral was held with state honour guard.
Trained in ‘Explosive Detection Task’ Shivaji Nagar, Pune. Participated well in anti-accident/explosion drives of VVIP/VIP threat calls. pic.twitter.com/LalEcaF5aD
— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) August 19, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..