ఈ మధ్యకాలంలో పాములు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం అయిపోయింది. చిన్న చిన్న పాముల దగ్గర నుంచి భారీ నల్ల త్రాచుపాముల వరకు అన్నీ కూడా జనాల మధ్యకు వస్తూ భయాందోళనలు గురి చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అది విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతం. పాతపాడేరు గ్రామం… ఆ గ్రామంలోని ఓ ఇంట్లో ఒక మూల నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఆ ఇంట్లో ఉంటున్న సభ్యులందరూ కూడా తమ పనుల్లో నిమగ్నమైపోయారు. ముందుగా ఆ శబ్దాలు గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే అవి క్రమేపీ పెద్దగా వస్తుండటంతో ఏంటని భయపడుతూనే ఆ శబ్దాలు వచ్చే వైపుకు వెళ్లి చూడగా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
అక్కడ ఓ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. అంతే అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ విషయాన్ని చుట్టుప్రక్కల వారికి తెలియడంతో స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు. స్నేక్ క్యాచర్ రంగంలోకి దిగడంతో అతడు చాకచక్యంగా పామును పట్టుకుని అడవుల్లోకి తీసుకెళ్లి వదిలిపెట్టాడు. దీనితో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read:
ఈ 9 లక్షణాలు ఉన్నట్లయితే.. గుండెపోటుకు సంకేతమే.! వెంటనే అలెర్ట్ అవ్వండి..
చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్.!
‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!
ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం.. వేటాడేందుకు దాగుంది.. పజిల్ కొంచెం కష్టమే.!