Viral Video: ఓరి దేవుడా.. పడుకునే బెడ్ కిందనే బుస్ బుస్..

|

Aug 14, 2024 | 4:45 PM

వర్షాకాలం వచ్చిందంటే.. పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అందులోనూ చెట్లు, పొదలు ఉన్న చోట పాముల సంచారం మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు ఎలుకలను వేటాడం కోసం పాములు బయటకు వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో పాముల బెడద చాలా ఎక్కువైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీటికి సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. హెల్మెట్లు, చెత్త బుట్టలు, షూస్‌లో..

Viral Video: ఓరి దేవుడా.. పడుకునే బెడ్ కిందనే బుస్ బుస్..
Viral Video
Follow us on

వర్షాకాలం వచ్చిందంటే.. పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అందులోనూ చెట్లు, పొదలు ఉన్న చోట పాముల సంచారం మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు ఎలుకలను వేటాడం కోసం పాములు బయటకు వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో పాముల బెడద చాలా ఎక్కువైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీటికి సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. హెల్మెట్లు, చెత్త బుట్టలు, షూస్‌లో, వాహనాలపై, కొన్ని సార్లు బట్టల్లో ఇలా కనిపిస్తూ జనాల్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా పాము ఏకంగా పడుకునే బెడ్ కిందనే దర్శనం ఇచ్చింది. ఇది చూసిన వ్యక్తి గుండె గుభేల్ మంది.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పడుకుందామని రూమ్‌కి వెళ్లాడు. అక్కడ ఏదో శబ్దం వస్తుంది. అటూ ఇటూ చూసినా ఏమీ కనిపించలేదు. మళ్లీ పడుకున్నాడు. మళ్లీ బుస్.. బుస్ అంటూ శబ్దం రావడంతో ఒక్కసారి మంచం కింద.. బెడ్ కింద చూశాడు. పరువు ఎత్తగానే పాము కనిపించడంలో వ్యక్తికి గుండె ఆగినంత పని అయ్యింది. వెంటనే స్నేక్ స్నాచర్ని పిలిపించాడు. అతను వచ్చి చూడగా.. బెడ్ కిందనే పాము ఉంది. వెంటనే దాన్ని పట్టాడు స్నేక్ స్నాచర్. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘మా బెడ్ కింద ఉందోమో చూసుకోవాలి భయా’.. ‘బాబాయ్.. జస్ట్ మిస్ కాటు వేస్తే ఏంటి సంగతులు’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.