Viral: వామ్మో ఇదేం కప్ప.. తిన్న పామును.. తిన్నట్లుగానే మలద్వారం నుంచి బయటకు..

|

Mar 13, 2023 | 12:52 PM

ఇలాంటి ఘటనలు చాలా అరుదు. మింగిన పామును అలానే కక్కడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. కానీ మింగిన పామును... సేమ్ అలానే విసర్జించింది ఈ కప్ప.

Viral: వామ్మో ఇదేం కప్ప.. తిన్న పామును.. తిన్నట్లుగానే మలద్వారం నుంచి బయటకు..
Snake Comes Out of Frog's Bum
Follow us on

ఆస్ట్రేలియా ప్రమాదకర పాములు, ఇతర సరీసృపాలకు ఆవాసంగా ఉంటుంది. అక్కడ విభిన్న జాతులు పాములు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కనిపించిన ఓ పాముకు సంబంధించిన ఘటన నెటిజన్లను ఉలిక్కిపడేలా చేసింది. మాములుగా పాములు కప్పలును తింటాయని మనకు తెలుసు. కానీ ఇక్కడ సీన్ రివ్సర్సయింది. ఓపాము పిల్లను కప్ప మింగేసింది. అయితే అది చనిపోయిన పాము పిల్లను  మింగిందా.. బతుకుండగానే మింగిందా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఆ తర్వాత దాన్ని మలద్వార నుంచి విసర్జించేందుకు యత్నించిన ఫోటోలను  ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది ప్రమాదకర ఈస్ట్రన్ బ్రౌన్ పాము పిల్లని ఆ ఫోటోల ద్వారా తెలుస్తుంది.

అయితే మింగినప్పటి లాగానే.. కప్ప ఆ పాము పిల్లను విసర్జించడం ఇక్కడ షాకింగ్ విషయం. కప్ప తన వెనుక  కాళ్లతో ఆ పామును పూర్తిగా బయటకు పంపలేకపోవడంతో.. గమనించిన మహిళ దానికి సాయం చేసింది.  ఆ పామును బయటకు లాగింది. గోల్డ్‌కోస్ట్‌కు 400కిలోమీటర్ల దూరంలో ఉన్న గూండివిండిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై నెటిజన్స్ నెట్టింట ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం కప్పరా బాబోయ్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఇవి గ్రీన్ ట్రీ ప్రాగ్స్(కప్పలు)…  సాధారణంగా సాలెపురుగులు,  బల్లులు, ఇతర కప్పలు,  బొద్దింకలను తింటాయి. కన్నాల్లోకి వెళ్లి చిన్న ఎలుకలను సైతం మింగేస్తాయి. ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. పాము చనిపోయినప్పటికీ, దాని కళేబరం కప్పకు విషపూరితం కావచ్చని ప్రొఫెషనల్ స్నేక్ క్యాచర్లలో ఒకరు తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..