Viral Video: ఎవరికైనా పొద్దున్నే నిద్రలేవాలంటే బద్దకంగా అనిపిస్తుంది. అందుకనే ఓ వైపు టైం అవుతున్నా.. బద్దకంగా ముసుగు వేసుకుని కొంచెం సేపు అంటూ.. మంచం మీద నుంచి లేవడానికి క్షణాలు లెక్కపెడుతూ ఉంటారు. ఓ పక్క ఆఫీసుకి టైమ్ అయిపోతున్నా.. ముసుగు తన్ని గుర్రు పెట్టి నిద్రపోతుంటారు కొందరు. అందుకు కారణాలు ఏమైనా… ఆనక బాస్‌తో తిట్లు తింటారు. పాపం త్వరగా లేవాలని అలారం పెట్టుకుంటారు.. కానీ అది మోగినప్పుడు అప్పుడే తెల్లారిందా నీకు అంటూ దాన్ని ఒక్కటి కొట్టి ఆపేసి మళ్లీ పడుకుంటారు. ఇదిగో ఈ వీడియోలో ఓ వ్యక్తి కూడా అలాగే చేస్తున్నాడు. బారెడు పొద్దెక్కినా ముసుగు తన్ని గుర్రుపెట్టి మరీ నిద్రపోతున్నాడు. అయితే అతడిని నిద్ర లేపడానికి సరికొత్త అలారం.. బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టింది. మరి ఆ సరికొత్త అలారం ఏమిటి అనుకుంటున్నారా.. కోడిపుంజు..
అతని పెంపుడు కోడి బెడ్ రూమ్ లోకి వచ్చింది. తన యజమాని గుర్రు పెట్టి నిద్రపోవడం చూసి.. ఓర్నీ నేను లేవడం.. ఊరందర్నీ లేపడం కూడా అయిపోయింది.. నువ్వింకా ముసుగుతన్ని పడుకుంటావా… ఉండు నీ పని చెప్తానంటూ అతని తల దగ్గరకు వెళ్లి ఒక్కటే అరవడం మొదలు పెట్టింది.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు అబ్బా ఎంత మంచి కోడి.. ఇలాంటి కోడి మాకూ ఉంటే బావుండును అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ ఫన్నీ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..