Video Viral: ఏం గుండె ధైర్యం రా బాబూ.. వేల అడుగుల ఎత్తులో హెలీకాప్టర్ నుంచి అమాంతం దూకేసి.. నెట్టింట వీడియో వైరల్

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్ (Guinness World Records) అంటే మనందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎవరూ చేయని పని చేసి, ప్రత్యేకత చాటుకునే వారి పేర్లను గిన్నిస్ నిర్వాహకులు బుక్ లో నమోదు చేస్తుంటారు. ఈ బుక్ లో పేరు సంపాందించడం కోసం..

Video Viral: ఏం గుండె ధైర్యం రా బాబూ.. వేల అడుగుల ఎత్తులో హెలీకాప్టర్ నుంచి అమాంతం దూకేసి.. నెట్టింట వీడియో వైరల్
Sky Surfing
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 27, 2022 | 7:20 PM

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్ (Guinness World Records) అంటే మనందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎవరూ చేయని పని చేసి, ప్రత్యేకత చాటుకునే వారి పేర్లను గిన్నిస్ నిర్వాహకులు బుక్ లో నమోదు చేస్తుంటారు. ఈ బుక్ లో పేరు సంపాందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రకరకాల స్టంట్స్, షోస్, కాంటెస్ట్స్ వంటివి చేస్తుంటారు. గిన్నిస్ బుక్ లో తమ పేరు చూసుకోవాలనే తపనతో చాలా మంది సాహసాలు చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రాణాలకు తెగించి స్టంట్స్‌ (Stunts) చేస్తుంటారు. అలాంటి వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చాలానే ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం ఎలాంటి సాహసం చేసాడో చూస్తే మీరు పక్కా షాకవుతారు. ఈ స్టంట్స్ కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాకు చెందిన కీత్ కెబె ఎడ్వర్డ్ స్నైడర్ అనే వ్యక్తి.. స్కై సర్ఫింగ్ చేస్తుంటాడు. సర్ఫింగ్ అంటే సముద్రపు అలలపై చేసేదని మనకు తెలిసిందే. అయితే ఈ స్కై సర్ఫింగ్ ఏమిటి అని అనుకుంటున్నారా.. అంటే వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి దూకి నేల మీదకు సర్ఫింగ్ చేస్తున్నట్టుగా రావడం.

ఎడ్వర్డ్ తన కాళ్లకు సర్ఫింగ్ బోటును కట్టుకుని తలకిందులుగా హెలికాప్టర్ స్పిన్స్ చేశాడు. ఈ ఏడాది జూలైలో వర్జీనియాలోని ఆరెంజ్ కౌంటీలో హెలికాప్టర్ నుంచి దూకి ఒకే దఫాలో ఏకంగా 175 రివర్స్ స్పిన్స్ చేశాడు. అయితే అప్పట్లో 165 రౌండ్లు మాత్రమే తిరిగాడు. తాజాగా ఆ రికార్డును అధిగమించాడు. వీడియోను గిన్నిస్ బుక్ తాజాగా తమ యూట్యూబ్ చానల్ లో పోస్ట్‌ చేసింది. దాంతో అది వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..