Telugu News Trending Singing teaching video was gone viral in social media Telugu Viral News
Video Viral: పాఠాలు చెప్పడంలో ఈ టీచర్ రూటే సపరేటు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
టీచింగ్ (Teaching) అనేది ఓ ఆర్ట్. ఏది పడితే అది, ఎలా పడితే అలా బోధిస్తే విద్యార్థులు సరిగ్గా అర్థం చేసుకోలేరు. వారి కోసం కొన్ని ప్రత్యేక బోధన పద్ధతులు పాటించాలి. అయితే కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే..
టీచింగ్ (Teaching) అనేది ఓ ఆర్ట్. ఏది పడితే అది, ఎలా పడితే అలా బోధిస్తే విద్యార్థులు సరిగ్గా అర్థం చేసుకోలేరు. వారి కోసం కొన్ని ప్రత్యేక బోధన పద్ధతులు పాటించాలి. అయితే కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటిస్తారు. టాస్క్ లు ఇవ్వడం, పాటలు పాడించడం, కథలు చెప్పడం వంటివి చెప్తూ బోధనపై వారికి ఇంట్రెస్ట్ కలిగిస్తారు. టీచింగ్ లో స్డూడెంట్స్ ను అటెన్షన్ కలిగించడం వల్ల వారు నేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. దేశంలో విద్యా విధానంలో బోధన, నేర్చుకునే విధానంపై రోజురోజుకూ కొత్త చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిహార్‌కు చెందిన ఓ టీచర్ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. బిహార్ సమస్తిపూర్‌లోని ప్రాథమిక బాలికల పాఠశాలలో వైద్యనాథ్ రజక్ అనే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యార్థులకు బిహార్‌లోని పిల్లలకు పాట పాడుతూ టీచింగ్ చేస్తున్నారు. ఈ 2:20 నిమిషాల వీడియోలో వైద్యనాథ్ బీహార్ సరిహద్దులో ఉన్న నేపాల్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌ల ప్రత్యేకతను విద్యార్థులకు అర్థమయ్యేలా పాట రూపంలో వివరించారు.
स्कूल की अंतिम घंटी में खेल और शैक्षिक मनोरंजन (Edutainment) के अंतर्गत प्रा.कन्या विद्यालय मालदह,हसनपुर (समस्तीपुर) के शिक्षक ‘बैद्यनाथ रजक’ ने बच्चों को अनोखे अंदाज में “बिहार की चौहद्दी” सिखाया.. pic.twitter.com/QrRw4E5Lvr
ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఆయన టీచింగ్ స్టైల్ ను ప్రజలు కొనియాడుతున్నారు. ఆయన బోధనా విధానంతో పాటు వాయిస్ కూడా చాలా బాగుంది. గతంలోనూ వైద్యనాథ్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. వడదెబ్బను ఎలా నివారించాలో విద్యార్థులకు పాటల ద్వారా తెలియజేస్తున్న వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టింది. మరో వీడియోలో రజక్ వేసవి సెలవులు ప్రారంభం కాబోతున్నాయని, ఆడుతూ, తిరుగుతూ సమయాన్ని వృథా చేయకుండా పుస్తకాలు చదవాలని సూచించారు.