Viral: శృంగార సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ఆ కాఫీ తాగాడు.. సీన్ కట్ చేస్తే.!

|

Jun 01, 2022 | 10:17 PM

పని ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు, బిజీ లైఫ్.. ఇలా చాలా కారణాల వల్ల ఈ మధ్య కొందరిలో శృంగార సామర్ధ్యం తగ్గిపోతోంది...

Viral: శృంగార సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ఆ కాఫీ తాగాడు.. సీన్ కట్ చేస్తే.!
Viral
Follow us on

పని ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు, బిజీ లైఫ్.. ఇలా చాలా కారణాల వల్ల ఈ మధ్య కొందరిలో శృంగార సామర్ధ్యం తగ్గిపోతోంది. శృంగారంపై వారి ఆసక్తి కూడా సన్నగిల్లిపోతుంది. అందుకే కొంతమంది శృంగార సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు మార్కెట్‌లో దొరికే వయాగ్రా టాబ్లెట్స్ లేదా మరేదైనా సాధనాల వైపు మరలుతున్నారు. ఇలాంటివి విపరీతంగా అమ్ముడుపోయినా.. వాటి వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

తాజాగా సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి తనకున్న అంగస్తంభన సమస్యను తగ్గించుకునేందుకు శృంగార సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు మార్కెట్‌లో అంగస్తంభన సమస్య చికిత్సకు ఉపయోగించే పదార్ధాలతో కూడిన కాఫీని తాగాడు. అది తాగగానే.. అతడి శరీరంలో సైడ్ ఎఫ్ఫెక్ట్స్ మొదలయ్యాయి. చేతులు, మూతి వాచిపోయి చివరికి ఆసుపత్రి పాలయ్యాడు.

లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు డ్రగ్స్ తీసుకోవద్దని సింగపూర్ హెల్త్ సైన్సెస్ అథారిటీ(HSA) ప్రజలను హెచ్చరించగా.. ఓ వ్యక్తి ప్రైమ్ కోపి పెజుయాంగ్ 3 ఇన్ 1 అనే లైంగిక పెరుగుదలను పెంపొందించే డ్రగ్ తీసుకున్నాడు. సదరు డ్రగ్‌లో అంగస్తంభన చికిత్సకు ఉపయోగించే తడలాఫిల్ అనే పదార్ధం అధిక స్థాయిని ఉంటుంది. దీనిని వైద్యులు మోతాదుకు తగ్గట్టుగా అవసరమైతేనే పేషెంట్స్‌కు ఇస్తుంటారు. ఒకవేళ తడలాఫిల్ మోతాదు మించితే.. గుండెపోటు, హార్ట్ స్ట్రోక్స్, ప్రియాపిజం వంటి అనర్ధాలకు దారి తీస్తుంది.

ఇవి కూడా చదవండి

 

ఈ మందును కనీసం ఇద్దరు పురుషులు తీసుకున్నారు. అందులో ఒకరు ఆసుపత్రిలో చేరారని తెలుస్తోంది. మరొకరు ప్రియాపిజంకు లోనైనట్లు తెలుస్తోంది. ప్రియాపిజం అనేది బాధాకరమైన, సుదీర్ఘమైన అంగస్తంభన ప్రక్రియ. దీనికి చికిత్స చేయకపోతే నపుంసకత్వానికి దారితీయవచ్చునని వైద్యులు చెబుతున్నారు. కాగా, ఇవి కొన్ని ఈ-కామర్స్ సైట్స్ విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న అక్కడి వైద్యారోగ్య శాఖ అధికారులు. వెంటనే ఆ ఉత్పత్తుల సేల్స్ నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చారు.