Motivational Story: భారతదేశం ఒక ప్రత్యేకమైన దేశం.. ఇక్కడ అంచెలంచెలుగా కొత్త సంస్కృతి, కొత్త భాష కనిపిస్తుంది. మనదేశంలో కేవలం నమ్మకంతో మాత్రమే దుకాణాలు నడుస్తున్న రాష్ట్రం గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం..ఇక్కడి షాపుల్లో దుకాణదారులు ఎవరూ ఉండరు… ఈ షాపులపై ఐఏఎస్ అవనీష్ శరణ్ ట్వీట్ చేశారు.ఈ రాష్ట్రం, ఇక్కడి దుకాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలోని ఉత్తర భాగంలో ఉన్న మిజోరం రాష్ట్రంలో హైవేపై కూరగాయలు,పండ్ల దుకాణాలు ఉంటాయి. ఈ షాపుల్లో దుకాణదారుడు ఉండరు. ఇక్కడ ఒక స్తంభంపై ధర మాత్రమే వ్రాసిన చిన్న బోర్డు వేలాడదీయబడి ఉంటుంది. డబ్బు పెట్టడానికి ఒక పెట్టె ఉంటుంది. సెయిలింగ్ మిజోరాం రాజధాని ఐజ్వాల్ నుండి 200 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో కనిపించింది ఈ దృశ్యం. ఈ దుకాణాలు తరచుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ షాపుల్లో దొంగతనం జరగలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మిజోరంలో ఈ సంస్కృతిని ‘న్ఘహ్-లౌ-డావర్’ అంటారు. ఈ దుకాణాలను కరోనా కాలంలో ప్రారంభించారు. హైవే పక్కన నిర్మించిన ఈ దుకాణాలలో కూరగాయలు, పండ్లు, చేపలు కాకుండా ఇంకా అనేకం విక్రయిస్తున్నారు.ఎవరైతే సరుకులు కొనాల్సి వస్తే అంత డబ్బును షాపులో ఉంచిన బ్యాగులో వేసుకుని అక్కడి నుంచి వస్తువులను తీసుకెళ్లేవారు. దుకాణదారులు షాపుల వద్ద కూర్చోవడం ప్రారంభిస్తే వ్యవసాయం చేయడానికి సమయం ఉండదని ఈ దుకాణాలను నడపడం వెనుక కారణం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి