AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ విమానం నీళ్లలో ల్యాండ్ అవుతుందా ఏంటీ?.. వీడియో చూస్తే మీరూ షాక్ అవుతారు..!

Viral Video: ఈ భూప్రపంచంలో వింతలకు, విశేషాలకు కొదవే లేదు. ఓపిక చేసుకుని వెతకాలే గానీ.. నిత్యం ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తూనే..

Viral Video: ఈ విమానం నీళ్లలో ల్యాండ్ అవుతుందా ఏంటీ?.. వీడియో చూస్తే మీరూ షాక్ అవుతారు..!
Plane Landing
Shiva Prajapati
|

Updated on: Jul 16, 2021 | 5:21 PM

Share

Viral Video: ఈ భూప్రపంచంలో వింతలకు, విశేషాలకు కొదవే లేదు. ఓపిక చేసుకుని వెతకాలే గానీ.. నిత్యం ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఈ వింతలు, విశేషాలు ఒక్కోసారి నమ్మశక్యం కానివిధంగా ఉంటాయి. వాటిని నమ్మడానికి కొంత సమయం పడుతుంటుంది. ఇక ఈ వింతలు, విశేషాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోను ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తే నిజంగా షాక్ అవుతారంతే. సాధారణంగా విమానాలు ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే పై ల్యాండ్ అవడం చూసుంటాం. కానీ ఈ విమానం ల్యాండ్ అవుతున్న విధానం చూస్తే మాత్రం ఇది నీళ్లలో ల్యాండ్ అవుతుందా ఏంటీ? అనే ఆశ్చర్యం కలుగక మానదు. అరే బాబూ.. అది నీళ్లలో పడిపోతుంది అని మనసులో ఆటోమాటిక్‌గా భావన వచ్చేలా ఈ వీడియో ఉంది. వీడియో చూస్తేనే ఇలా ఉంటే.. ఇక ఆ విమానంలో ప్రయాణించే వారి పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమానం కిటికీ అద్దాల్లోంచి చూస్తే.. విమానం నీళ్లలో కూలిపోతుందేమో అనే భయం కలుగక మానదు. ఈ ప్రమాదకరమైన విమానం ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని విచిత్రమైన ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో, సముద్ర తీరాల్లో, ప్రత్యేక ప్రదేశాల్లో విమానాశ్రయాలను నిర్మించారు. ఇలాంటి నిర్మాణాల్లో ఇది కూడా ఒకటని చెప్పాలి. ఈ ఎయిర్‌పోర్ట్‌‌ను నదీ తీరంలో నిర్మించారు. విమానం ఈ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వాలంటే.. నది మీదుగా రావాల్సి ఉంటుంది. అయితే, ఈ ల్యాండింగ్ సమయంలో చూస్తే మాత్రం గుండెలు అదిరిపోతాయి. అది నీళ్లలో పడిపోతుందా? అనే భావన కలుగుతుంది. నీటికి సమీపంలో రన్‌వే ఉండటంతో.. అలా అనిపిస్తుంది. మొత్తంగా ఈ షాకింగ్ ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ‘modified_jatt_mehkma’ ఇన్‌స్టా అకౌంట్‌లో ఐదు గంటల క్రితం షేర్ చేయగా.. గంటల వ్యవధిలోనే 18 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. మరెందుకు ఆలస్యం ఈ ఆశ్చర్యకరమైన వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Weight Loss: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా..? అయితే మీ డైట్‌లో ‘తులసి టీ’ చేర్చాల్సిందే.. !

Corona Virus: పొంచి ఉన్న కరోనా థర్డ్‌వేవ్.. వాహకాలుగా మారుతున్న టీ స్టాల్స్, ఏటీఎంలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే

Bakrid 2021: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. బక్రీద్‌ పండుగ నిర్వహణపై ఆంక్షలు..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..