Watch Video: టూరిస్టుల ట్రక్కును గాల్లోకి లేపి పడేసిన ఏనుగు.. వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే
మీరు జంగిల్ సఫారికి వెళ్తున్నారా.. అయితే జర జాగ్రత్తగా ఉండాల్సిందే. సింహమే కదా అని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారో.. ఏనుగు కదా టచ్ చేయడానికి ప్రయత్నించారో.. ఇక అంతే సంగతులు. ఒక్కొసారి ప్రాణాలకు ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. అయితే ఓ ఏనుగు చేసిన భీభ్సతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మీరు జంగిల్ సఫారికి వెళ్తున్నారా.. అయితే జర జాగ్రత్తగా ఉండాల్సిందే. సింహమే కదా అని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారో.. ఏనుగు కదా టచ్ చేయడానికి ప్రయత్నించారో.. ఇక అంతే సంగతులు. ఒక్కొసారి ప్రాణాలకు ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. అయితే ఓ ఏనుగు చేసిన భీభ్సతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమాలో చూసినట్టు బాలయ్య మాదిరిగా తొండంతో భారీ ట్రక్కును లేపి పడేసింది. అందుకు సంబంధించి ద్రుశ్యాలు వైరల్ అవుతున్నాయి.
దక్షిణాఫ్రికాలో సఫారీ ట్రక్కు వద్దకు వచ్చిన ఏనుగు గాల్లోకి లేపడంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. జొహన్నెస్ బర్గ్ కు వాయవ్యంగా సమీపంలోని పిలనెస్ బర్గ్ నేషనల్ పార్క్ లో మార్చి 18న ఈ ఘటన జరిగింది. స్థానిక దక్షిణాఫ్రికాకు చెందినవారు ఆ ప్రాంతంలో పర్యటిస్తుండగా ఏనుగుకు చాలా దగ్గరగా వెళ్లి ఫొటోలు తీశారు. అప్పుడే ఏనుగు ఒక్కసారిగా దూసుకొచ్చి సఫారీ ట్రక్కుపై విరుచుకుపడి, గాల్లోకి ఎత్తి పడేసింది.
తన తొండంతో ముందు భాగాన్ని పైకి లేపి, దానిని నేలపై పడేస్తుంది. ఈ ఘటనతో టూరిస్టులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో కాపాడాలంటూ కేకలు వేశారు. ఆ తర్వాత డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పినట్టయింది. గైడ్ వాహనాన్ని వెనక్కు తిప్పి ఏనుగును నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై అక్కడి పర్యాటకులు మాట్లాడుతూ ఏనుగు చాలా క్రూరంగా వ్యవహరించిందని, ఒక్కసారిగా దూసుకురావడంతో ఏం చేయాలో అర్ధం కాలేదన్నారు. ఏనుగు దాడిలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, ఆందోళనకు గురైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
An elephant attacks a tourist truck in South Africa 🇿🇦 pic.twitter.com/BX8typkcUq
— Africa In Focus (@AfricaInFocus_) March 19, 2024
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.