నేటి కాలంలో ప్రతి ఒక్కరూ లైక్‌లు, వ్యూస్ కోసం ఎలాంటి రిస్క్ అయినా సరే చేసేందుకు వెనుకాడటం లేదు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాంతక స్టంట్స్ కూడా చేస్తున్నారు. ఇలాంటి భయానక స్టంట్స్ చేస్తున్న క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రజలు వాటిని చూడడమే కాకుండా ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఇలాంటి వీడియో ఈ రోజుల్లో చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇద్దరు యువకులు చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు బైకుపై విచిత్ర స్టంట్ చేసేందుకు ప్రయత్నించారు. హెల్మెట్ పెట్టుకున్న ఓ యువకుడు బైకు డ్రైవ్ చేస్తుండగా.. వెనుక మరో వ్యక్తి కూర్చున్నాడు. కొంచెం దూరం డ్రైవ్ చేయగానే వెనక్కి తిరిగి కూర్చుంటాడు. అలా కూర్చున్న తర్వాత.. చేతులు వెనక్కి పెట్టి హ్యాండిల్ పట్టుకుంటాడు. ఈ క్రమంలో ఇంకొంచె దూరం వెళ్లగానే బ్యాలెన్స్ తప్పి కిందపడిపోతాడు.
ఈ వీడియో చూడండి..
Bhai ab ye Chapri kabhi stunt nahi karega pic.twitter.com/YEMTQMtHtv
— Vishal (@VishalMalvi_) September 23, 2024
ఈ వీడియో @VishalMalvi_ అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేయబడింది. దీన్ని 70 వేల మందికి పైగా చూశారు. వీడియో చూసిన ప్రతిఒక్కరూ దీనిపై తీవ్రంగా స్పందించారు. కదులుతున్న బైక్‌పై ఇంకో స్టైల్ చూపించండి అని మరో యూజర్ రాశాడు.. మరో యూజర్ తన ప్రాణాలను పణంగా పెట్టే హాబీ ఏమిటో నాకు తెలియదు అంటూ వాపోతూ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..