పాములతో జర భద్రం గురూ…! అసలే సమ్మర్ సీజన్. వేసవి తాపానికి అవి జనావాసాల్లోకి వస్తున్నాయి. కాటు పడిందంటే.. పెను ప్రమాదం ముసిరినట్లే. ఎక్కువగా మరుగు ఉన్న ప్రాంతాల్లో అవి నక్కి ఉంటాయి. అదే విధంగా మీరు షూస్ వేసుకునే ముందు.. ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తే బెటర్. ఎందుకంటే.. ఈమధ్య ప్రమాదకర పాములతో బూట్లలో నక్కుతున్నాయి. అమెరికా లూసియానాలోని బాటన్ రూజ్‌కు చెందిన జెఫ్రీ టక్కర్ ఇటీవల తన క్రాక్స్‌లో విషపూరిత వాటర్ మొకాసిన్ పామును గుర్తించి కంగుతిన్నాడు. దాదాపుగా అడుగుపెట్టే సమయంలో దాన్ని గుర్తించానని.. సెకన్ల వ్యవధిలో పెను ప్రమాదం తప్పిందని తెలిపాడు.
“నా బూట్లు వెనుక డాబాపై ఉన్నాయి. వెళ్లి వాటిని ధరించేందుకు ప్రయత్నించాను. ఈ సమయంలో ఆ పాము తన తలను బయటకు తీసింది. దీంతో వెనక్కు పరుగులు తీశాను. ఇది పాము పిల్ల. కేవలం ఒక అడుగు పొడవు మాత్రమే ఉంది. అయినప్పటికీ చాలా డేంజర్. మా ఇంట్లో అప్పుడప్పుడు కప్పలు కనబడుతూ ఉంటాయి. కానీ పాము కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్.” అని జెఫ్రీ తెలిపాడు.
కాగా వాటర్ మొకాసిన్ పామును కాటన్‌మౌత్ అనే పేరుతో పిలుస్తారు. పాము నోటి లోపలి భాగంలో ఉన్న తెల్లని రంగు కారణంగా అలా పిలుస్తారు. ఇవి 1.5 నుంచి 4.5 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఆగ్నేయ US అంతటా ఇవి కనిపిస్తాయి. కాటన్‌మౌత్ కాటు వేయడం చాలా అరుదు అయినప్పటికీ, దాని విషంలో శక్తివంతమైన రక్త టాక్సిన్ ఉంటుంది. ఇది మానవులకు ప్రాణాంతకం. (Source)
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..