Viral Video : మధ్యప్రదేశ్‌లో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. శివపురి జిల్లాలో రికార్డ్ వర్షపాతం నమోదైంది. ఏ జిల్లాలో చూసినా నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు బయటకు వచ్చి సరదాగా గడుపుతున్నారు. అయితే శివపురి జిల్లాలోని ఓ మార్కెట్‌లో వరదనీటిలో ఓ మొసలి కొట్టుకొచ్చింది. గమనించిన స్థానిక ప్రజలు దానిని పట్టుకొని తాళ్లతో బంధించారు. అంతేకాకుండా మొసలిని ఎత్తుకొని సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. అయితే ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
శివపురి నగరానికి సమీపంలో ఒక జాతీయ ఉద్యానవనం ఉంది. ఈ జాతీయ ఉద్యానవనంలో అనేక మొసళ్ళు ఉన్నాయి. జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో జాతీయ ఉద్యానవనం పక్కనే ఉన్న కాలువల నుంచి మొసళ్ళు పట్టణ ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం శివపురి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో మొసళ్లు నీటితో తడిసిన రోడ్లపై ఈత కొట్టడం కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రజలు మొసలిని తాడులతో కట్టి, వారి భుజాలపై ఎత్తుకొని ఫోటోలు దిగుతుండటం మనం వీడియోలో చూడవచ్చు.
శివపురి జిల్లాలో చాలా సంవత్సరాల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలువల ద్వారా మొసలి నగరంలోని మాంసం మార్కెట్లోకి వచ్చింది. మొదటగా వర్షంలో తడిసిన యువత ఈ మొసలిని పట్టుకున్నారు. అయితే తాళ్లతో బంధించిన మొసలి విడిపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో కొంతమంది భుజాల పై నుంచి కిందపడుతుంది. ఈ సమయంలో యువత నవ్వుతూ కనిపించడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. సాధారణంగా మొసలిని చూస్తే చాలామంది భయంతో దూరంగా ఉంటారు కానీ ఇక్కడి ప్రజలు దానిని పట్టుకొని ఆటలు ఆడటం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అయితే సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ బృందం ఘటనా స్థలానికి చేరుకుని మొసలిని తీసుకెళ్లి చంద్‌పథ సరస్సులో వదిలిపెట్టారు.
बाढ़ के बाद शिवपुरी के मीट मार्केट इलाके में मगरमच्छ निकल आया, जिसे स्थानीय लोगों ने पकड़ लिया. युवकों ने मगरमच्छ के साथ सेल्फी लेने के चक्कर में बेजुबान का मजाक बना दिया। थोड़ी देर बाद वन विभाग की टीम ने मगरमच्छ को कब्जे में लेकर चांदपाटा झील में छोड़ दिया। #Shivpuri pic.twitter.com/zLojgnyJr1
— Nitesh Ojha (@niteshojha786) August 5, 2021