తెలివి తేటలు అనేవి ఏ ఒక్కరి సొంతంకాదు.. అనేక సృజనాత్మక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు ప్రతి దాంట్లో తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. చాలా మంది ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో క్రియేటివ్‌గా కట్టిన భవనాలు, బంగ్లాలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం. రాళ్లతో ఒక ఖచ్చితమైన కారును రూపొందించడానికి ఒకరు అటువంటి సృజనాత్మక ఆలోచనకు పదును పెట్టారు. ప్రస్తుతం వారి ఆలోచనకు వచ్చిన రూపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..ఇది చూసిన తర్వాత మీరు ముక్కు వేలేసుకోవటం కాయం.
మీరు రాళ్లతో చేసిన వివిధ ఆకారాలు, నిర్మాణాలు, విగ్రహాలు, రాళ్లతో చేసిన ఇతర అలంకార వస్తువులను చూసి ఉంటారు. కానీ ఒక వ్యక్తి బండ రాళ్లను ఉపయోగించి అద్భుతమైన కారును తయారు చేశాడు. దూరం నుండి చూస్తే, ఇది నిజంగా కారులా కనిపిస్తుంది. ఎందుకంటే రాళ్లతో తయారు చేసిన ఈ కారులో టైర్ల నుంచి హెడ్ లైట్ల వరకు, అద్దాల నుంచి నంబర్ ప్లేట్ల వరకు అన్ని పర్ఫెక్ట్‌గా అమర్చాడు. అంతే కాదు, కిటికీలు వెనుక వైపు గ్లాస్ విండో కూడా నిజమైన కారులోని గాజులాగానే రాయితో తయారు చేశారు. అందుకే మార్గమధ్యంలో నిలబడిన ఈ కారు చాలా మందిని ఆకర్షిస్తూ ఉండటంతో ఆ వ్యక్తిలోని ఈ క్రియేటివిటీ ఇప్పుడు ఇంటర్‌నెట్ వేధికగా చర్చనీయాంశమవుతోంది.
ఈ వీడియోని Instagram ఖాతా @insaatmuh_mimar ద్వారా షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు. ఇది అద్భుతమైన ఆలోచన అని పలువురు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. కారు చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. లైకులు, షేర్లు, కామెంట్లతో కారు వీడియో నెట్టింట బ్రేకులు లేకుండా దూసుకుపోతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..