స్కూల్లో పాఠాలు వింటున్న వానరం

| Edited By:

Jul 22, 2019 | 9:56 PM

మచ్చిక చేసుకుంటే వానరాలు మనకు దగ్గరవుతాయి. సరదాగా అవి చేసే చేష్టలు చూసి అంతా నవ్వుకుంటాం. కానీ కొండముచ్చును చూస్తే మాత్రం భయపడి దూరంగా పారిపోతాం. వనరాలకంటే అవి బలంగా ఉండటం ఒక కారణం. అయితే కర్నూలు జిల్లా వెంగళాంపల్లి గ్రామంలో కొండముచ్చు ఏకంగా బడిపిల్లలకు చేరికైంది. ప్రతిరోజు ఇక్కడ ప్రభుత్వ పాఠశాల పిల్లలు పెట్టే తినుబండారాలకు అలవాటుపడి వారితో స్నేహం చేయడం ప్రారంభించింది. దీని స్నేహం ఎంతవరకు వెళ్లిందంటే స్కూల్లో పాఠాలు నేర్చుకునే దాకా. ఇక్కడికి […]

స్కూల్లో  పాఠాలు వింటున్న వానరం
Follow us on

మచ్చిక చేసుకుంటే వానరాలు మనకు దగ్గరవుతాయి. సరదాగా అవి చేసే చేష్టలు చూసి అంతా నవ్వుకుంటాం. కానీ కొండముచ్చును చూస్తే మాత్రం భయపడి దూరంగా పారిపోతాం. వనరాలకంటే అవి బలంగా ఉండటం ఒక కారణం. అయితే కర్నూలు జిల్లా వెంగళాంపల్లి గ్రామంలో కొండముచ్చు ఏకంగా బడిపిల్లలకు చేరికైంది. ప్రతిరోజు ఇక్కడ ప్రభుత్వ పాఠశాల పిల్లలు పెట్టే తినుబండారాలకు అలవాటుపడి వారితో స్నేహం చేయడం ప్రారంభించింది. దీని స్నేహం ఎంతవరకు వెళ్లిందంటే స్కూల్లో పాఠాలు నేర్చుకునే దాకా. ఇక్కడికి దగ్గర్లో ఉన్న అడవినుంచి వచ్చిన ఈ కొండముచ్చు బడిలో పిల్లలతో కలిసి పోయి పాఠాలు కూడా వింటుంది. ఇది ఎవరినీ ఏమీ అనకపోవడంతో ఇక్కడ విద్యార్ధులు సైతం దానితో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.