Watch Video: వార్ని ఇదెక్కడి వింత.. మండే ఎడారిలో మంచు దుప్పటి.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న దృశ్యం!

సాధారణంగా ఎడారి అంటే మనకు గుర్తుకు వచ్చేది మండే ఎండలు, ఇసుక తిన్నెలు. కానీ సౌదీ అరేబియాలో మాత్రం ఈ సీన్ రివర్స్ అయింది. ఎండలతో సెగలు పుట్టించే ఎడారి ప్రాంతంతో ఇప్పుడు తెల్లని మంచు దుప్పటి దర్శనమిస్తుంది. అవును సౌదీ అరేబియా చరిత్రలో అరుదుగా జరిగే ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 30 ఏళ్ల తర్వాత సౌదీ అరెబియా మంచు కురిసింది.

Watch Video: వార్ని ఇదెక్కడి వింత.. మండే ఎడారిలో మంచు దుప్పటి.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న దృశ్యం!
Saudi Arabia Snowfall

Edited By:

Updated on: Dec 23, 2025 | 5:11 PM

గత కొన్ని రోజులుగా సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాల్లో ముఖ్యంగా అల్-జౌఫ్ రీజియన్‌లో భారీ వర్షాలతో పాటు అసాధారణ రీతిలో మంచు కురుస్తోంది. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమతో కూడిన గాలులు, అల్పపీడన ప్రభావంతో న్ ఇలాంటి మార్పులు చోటుచేసుకున్నట్లు వెదర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఎడారిలోని ఇసుక తిన్నెలపై మంచు పేరుకుపోవడంతో ఆ ప్రాంతమంతా స్విట్జర్లాండ్‌ను తలపిస్తోంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు స్థానికులతో పాటు టూరిస్టులు భారీగా తరలివస్తున్నారు. అయితే సౌదీ అరెబియాలో మంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని సౌదీ వాతావరణ శాఖ (NCM) హెచ్చరికలు జారీ చేసింది.

ఎడారిలో మంచుకు కారణం అదేనా..?

ఒకప్పుడు ఎడారిగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి మార్పులు రావడం వెనుక గ్లోబల్ వార్మింగ్ కారణమనే బలమైన చర్చ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఎండలు కాయాల్సిన చోట వర్షాలు, మంచు కురుస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సౌదీలో కురుస్తున్న ఈ మంచు ప్రకృతి వింతగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది భూమిపై మారుతున్న వాతావరణ సమతుల్యతకు సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మంచుతో మెరిసిపోతున్న ఎడారి దృశ్యాలు మాత్రం నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.