ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల పాములు ఉన్నాయి. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు. విషపూరితమైన పాములు ప్రపంచంలో కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తాయి. వీటిలో కింగ్ కోబ్రా , క్రైట్, బ్లాక్ మాంబా, బూమ్‌స్లాంగ్ వంటి జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములుగా నిర్ధారించబడ్డాయి. పాములకు సంబంధించిన రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్లిప్ లో ఓ పాము ఇసుకలో దాక్కునే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వీడియోలో ఓ పాము ఇసుకలో ఉంటుంది. అది తనను తాను శత్రువుల నుంచి కాపాడుకునేందుకు ఇసుకలో కూరుకుపోతుంది. ఈ పాము పేరు సాండ్ వైపర్. ఆఫ్రికా, ఆసియాలోని ఎడారి ప్రాంతాలలో కనిపించే ఈ పాములు ఎలుకలు లేదా ఇతర చిన్న జీవులను తింటూ జీవనం కొనసాగిస్తాయి. అయితే ఈ పాము విషపూరితమైనది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
How a Sand Viper conceals itself to prepare for an ambush pic.twitter.com/lMN0GDlJz3
ఇవి కూడా చదవండి— H0W_THlNGS_W0RK (@wowinteresting8) August 12, 2022
ఈ పాము ప్రత్యేకమైన విధంగా, ఆశ్చర్యకరమైన రీతిలో ఇసుకలో దాక్కునే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 33 సెకన్ల వీడియోను 2.6 మిలియన్లకు పైగా వీక్షించారు. 87 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..