బస్సులో దొరికిన కోడిపుంజుకు ఆర్టీసీ వేలం.. ఆఖరు నిమిషంలో అద్దిరిపోయే ట్విస్ట్‌..!

|

Jan 12, 2024 | 12:13 PM

అయితే, ఆర్టీసీ నిబంధనల ప్రకారం..లాస్‌ ఆఫ్‌ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించాల్సి ఉంటుందని డిపో-2 మేనేజర్‌ తెలిపారు. పందెం కోడి కోసం ఎవరూ రాకపోవడంతో శుక్రవారం వేలం వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు

బస్సులో దొరికిన కోడిపుంజుకు ఆర్టీసీ వేలం.. ఆఖరు నిమిషంలో అద్దిరిపోయే ట్విస్ట్‌..!
Pandem Kodi Auction
Follow us on

కరీంనగర్, జనవరి 12; మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని శుక్రవారం వేలం వేసేందుకు ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేశారు.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు డిపో-2 ఆవరణలో అధికారులు కోడిని వేలం వేయనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగానే.. కోడి వేలంలో కొత్త ట్విస్ట్‌ ఎదురైంది.. కోడి తానదేనంటూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు మహేష్ అనే వ్యక్తి.. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో దొరికిన కోడి నాదేనంటూ బాధితుడు వీడియో ద్వారా తన ఆవేదన వెల్లగక్కాడు..నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్‌ బతుకుతెరువు కోసం రుద్రంగికి వచ్చినట్టుగా చెప్పాడు. రుద్రంగి నుండి కరీంనగర్ మీదుగా నెల్లూరు వెళ్ళే క్రమం లో తెల్లవారు జామున కరీంనగర్ బస్టాండ్ బస్ దిగి కోడిని మర్చిపోయానంటూ మహేష్‌ వీడియో విడుదల చేశాడు. పందెంకోడి వేలాన్ని నిలిపివేయాలని డిపో మేనేజర్ ని వేడుకున్నాడు మహేష్.

కోడి యజమాని కూడా వేలం పాట లో పాల్గొనాలని కరీంనగర్ ఆర్టీసీ డిపో-2 మేనేజర్ నిర్లక్ష్య సమాధానం ఇచ్చాడంటూ మహేష్ వాపోయాడు. అంతేకాదు.. ప్రయాణ సమయంలో తాను కోడికి కూడా టికెట్ తీసుకున్నాని చెప్పాడు. అందుకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నాడు మహేష్. నాదే కోడి అంటూ సెల్ఫ్ వీడియో విడుదల చేయటంతో కోడి వేలం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఆర్టీసీ నిబంధనల ప్రకారం..లాస్‌ ఆఫ్‌ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించాల్సి ఉంటుందని డిపో-2 మేనేజర్‌ తెలిపారు. పందెం కోడి కోసం ఎవరూ రాకపోవడంతో శుక్రవారం వేలం వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పాల్గొనవచ్చని సూచించారు. వచ్చిన మొత్తాన్ని ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు. కోడి వేలం ఆఖరు నిమిషంలో కథ ఇలా అడ్డం తిరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.