KumbhMela 2025: మహా కుంభమేళాలో తొలిసారిగా.. రంగంలోకి రోబోలు.. ఇవి ఏం చేస్తాయంటే..

|

Nov 26, 2024 | 7:30 PM

ఇందుకోసం హైదరాబాద్‌లో శిక్షణ పొందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని అడిషనల్ డైరెక్టర్ జనరల్ పద్మజా చౌహాన్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితులలో సిబ్బంది చేరలేని ప్రదేశాలకు కూడా ఈ రోబోలు వెళ్తాయని చెప్పారు. ప్రతి రోబో 20-25 కిలోల బరువుతో ఉంటుంది.ఇవి మెట్లు కూడా ఎక్కి

KumbhMela 2025: మహా కుంభమేళాలో తొలిసారిగా.. రంగంలోకి రోబోలు.. ఇవి ఏం చేస్తాయంటే..
Mahakumbh 2025
Follow us on

ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా వచ్చే ఏడాది 2025 జనవరి 13న ప్రారంభంకానుంది. ఇందుకోసం అన్ని శాఖలు భారీ ఏర్పాట్లతో సన్నద్ధమవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం ప్రశాంతంగా ముగిసే వరకు అధికార యంత్రాంగం హర్నిశలు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. మహా కుంభమేళలో ఎటువంటి అవాంఛీత సంఘటనలు, అగ్నిప్రమాదాలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది ఫైర్‌ సెఫ్టీ విభాగం. ప్రత్యేకంగా, కుంభమేళాలో జరిగే అనర్థాలను అడ్డుకోవడానికి రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని సురక్షితంగా జరిగేలా అగ్నిమాపక శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం 200 మంది అగ్నిమాపక కమాండోలను కూడా నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో శిక్షణ పొందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని అడిషనల్ డైరెక్టర్ జనరల్ పద్మజా చౌహాన్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితులలో సిబ్బంది చేరలేని ప్రదేశాలకు రోబోటిక్ ఫైర్ టెండర్లు పంపిస్తామని చెప్పారు. ప్రతి రోబో 20-25 కిలోల బరువుతో ఉంటుంది.ఇవి మెట్లు కూడా ఎక్కి మంటలను అదుపు చేయగలవు.

అంతేకాదు, 35 మీటర్ల ఎత్తు నుండి నీటిని చల్లి మంటలను అదుపు చేసేలా ఆర్టిక్యూలేటింగ్ వాటర్ టవర్‌లు, ఆధునిక కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ తరహా ప్రత్యేక శిక్షణ పొందిన ఎస్‌టీఆర్‌జీ యూనిట్‌ను కూడా స్థాపించామని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..