Viral Video: భూమి మీద నూకలున్నాయంటే ఇదే మరి.. యముడికి హాయ్ చెప్పి వచ్చిన బైకర్.. వీడియో చూస్తే హడలే..

ప్రస్తుత రోజుల్లో బైక్ రైడింగ్.. సైక్లింగ్ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. కేవలం చుట్టు ప్రక్కల ప్రాంతాలే కాదు.. పర్వతాల

Viral Video: భూమి మీద నూకలున్నాయంటే ఇదే మరి.. యముడికి హాయ్ చెప్పి వచ్చిన బైకర్.. వీడియో చూస్తే హడలే..
Viral News

Updated on: Nov 16, 2021 | 6:53 PM

ప్రస్తుత రోజుల్లో బైక్ రైడింగ్.. సైక్లింగ్ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. కేవలం చుట్టు ప్రక్కల ప్రాంతాలే కాదు.. పర్వతాల మధ్య చేయడం సరదాగా తీసుకుంటున్నారు. కశ్మీర్, లడఖ్ వంటి ప్రాంతాలను బైక్ పై చూట్టేస్తున్నారు. అయితే దూర ప్రాంతాలు.. పర్వత ప్రాంతాలకు వెళ్లినప్పుడు తమ ప్రయాణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో చేస్తున్నారు బైకర్స్. అయితే ఎంతో సరదాగా సాగే ఈ ప్రయాణాలు కొన్ని అనుకోని ప్రమాదాలకు కూడా దారితీస్తాయి. కొండ ప్రాంతాల్లో చేసే డ్రైవింగ్ ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన ప్రాణాలు పోయినట్లే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ బైకర్.. యుముడికి హాయ్ చెప్పి మరీ వచ్చినట్లుగా తెలుస్తోంది. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం ఏంటంటే.. శ్రీనగర్, లడకఖ్ మధ్య జోజిలా పాస్ పర్వతాల గుండ ఇద్దరు బైకర్స్ వెళ్తున్నారు. అయితే వారి బైక్స్ కంటే ముందు ఇనుప పైపులతో నిండిన ట్రక్కు వెళ్తుంది. ఇంతకు ఓ బైకర్ ఆ ట్రక్కును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించబోయాడు. అయితే వారు ప్రయాణిస్తున్న రోడ్డు పూర్తిగా బురదమయంగా ఉంది. ఆ బైకర్ ట్రక్కు వద్దకు వెళ్లగానే ఒక్కసారిగా స్కిడ్ అయి పడిపోయాడు. అయితే కాస్త బైక్ వేగంగా ఉంటే.. పక్కనే ఉన్న లోయలో పడిపోయేవాడు.. కానీ అదృష్టవశాత్తు అతను బైకుని కంట్రోల్ చేసి కాలు కింద పెట్టి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన మొత్తం.. మరో బైకర్ రికార్డ్ చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Ramya Krishna: మెగాస్టార్ సినిమాలో రమ్యకృష్ణ.. కీలక పాత్రలో నటించనున్న శివగామి..

Nithiin Macherla Niyojakavargam: నితిన్ మాచర్ల నియోజకవర్గంలో మరో హీరోయిన్.. ప్రకటించిన చిత్రయూనిట్..

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ ‏కుమార్ సంస్మరణ సభ ..కన్నడ పవర్ స్టార్‏కు కర్ణాటక రత్న అవార్డ్..