మానస్ నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం హల్‌చల్ చేసింది. పర్యాటక వాహనాన్ని వెంబడించి పరుగులు పెట్టించింది. ఈ సంఘటన గురువారం జరిగినట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో మానస్ నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం పర్యాటక వాహనాన్ని వెంబడించడం కనిపించింది. కానీ, అదృష్టవశాత్తు..ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలుగకపోవటంతో అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన అటవీ శాఖ వివరాలు వెల్లడించింది. జరిగిన సంఘటన డిసెంబర్ 29న జరిగినట్టుగా తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని మానస్ నేషనల్ పార్క్ ఫారెస్ట్ రేంజ్ అధికారి బాబుల్ బ్రహ్మను వెల్లడించారు.
ఇదిలా ఉంటే, అంతకుముందు నవంబర్‌లో అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో ఒక ఖడ్గమృగం పర్యాటకులపై దాడిచేసింది. ఆ దాడిలొ ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్ పార్క్‌లోని కొహోరా అటవీ రేంజ్ పరిధిలోని బోర్‌బీల్ ప్రాంతంలో పార్క్ లోపల దెబ్బతిన్న రోడ్డు మరమ్మతు పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
#WATCH | Baksa, Assam | One-horned rhinoceros seen chasing tourist vehicle in Manas National Park, video goes viral
“This happened on December 29. No casualty was reported,” says Babul Brahma, Forest Range officer, Manas National Park
(Viral visuals confirmed by Forest Dept) pic.twitter.com/WqLJP006x9
— ANI (@ANI) December 30, 2022
గాయపడిన వారిని నేషనల్ పార్క్‌లో ఫారెస్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న బినోద్ సరో, స్థానిక యువకుడు జిబాన్ సరోగా గుర్తించారు. గాయపడిన వారిని కోహోరా సివిల్ ఆసుపత్రికి తరలించారు. బోర్‌బీల్ యాంటీ-పోచింగ్ క్యాంపు ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బిభూతి రంజన్ గొగోయ్ తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి