Viral Video: ఫోన్ మైకంలో ఉండగా.. ప్యాంటులోకి దూరిన ఎలుక.. ఆ తర్వాత ఏమైందంటే.. వీడియో

Shopkeeper - Rat Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.. తాజాగా

Viral Video: ఫోన్ మైకంలో ఉండగా.. ప్యాంటులోకి దూరిన ఎలుక.. ఆ తర్వాత ఏమైందంటే.. వీడియో
Viral Video

Updated on: Nov 06, 2021 | 1:41 PM

Shopkeeper – Rat Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.. తాజాగా వైరల్ అయిన వీడియోలో.. ఓ దుకాణాదారుడు.. పడుకొని.. తాపీగా విశ్రాంతి తీసుకుంటుంటాడు. కాస్త ఖాళీ సమయం దొరకడంతో ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటుంటాడు. ఈ క్రమంలో అతనికి పెద్ద సమస్య వచ్చిపడుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. దుకాణదారుడి దుస్తులను బట్టి చూస్తే ఆ వ్యక్తి పాకిస్థానీ అని తెలుస్తోంది. దుకాణదారుడు పఠానీ వేషధారణలో.. చాప మీద నేలపై పడుకుని.. వీడియో కాల్‌లో మాట్లాడుతూ నవ్వుకుంటున్నాడు. అటుఇటు కదులుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. సరిగ్గా ఈ సమయంలోనే అతని పెద్ద సమస్య వచ్చి పడుతుంది. ఎలుక పరిగెత్తకుంటూ వచ్చి నేరుగా అతని ప్యాంటులోకి దూరుతుంది. వెంటనే తన ప్యాంటులోకి ఏదో దూరినట్లు గ్రహించిన దుకాణదారుడు లేచి ప్యాంటును దులుపుకుంటాడు. కానీ.. ఎలుక మాత్రం బయటకు రాదు. ఇక లాభం లేదనుకున్న దుకాణాదారుడు తన ప్యాంటు నాడాను విప్పుతాడు. దీంతో ప్యాంటులోకి దూరిన ఎలుక కిందకు దూకుతుంది. వెంటనే ఊపిరి పీల్చుకున్న దుకాణదారుడు ప్యాంటును మళ్లీ వేసుకుంటాడు.
వైరల్‌ వీడియో..

Also Read:

Throwback Pic: ఈ ఫోటోలోని వరల్డ్ ఫేమస్ జంటను గుర్తుపట్టారా? ఈజీగా చెప్పేయెచ్చు..

Viral Video: చిన్ననాటి ఆ సంతోషాలు ఎప్పటికీ మర్చిపోలేనివి.. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు..