బాబోయ్‌ భయంకర చేప.. వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్‌..! వింతను చూసేందుకు ఎగబడ్డ జనాలు..

|

Aug 13, 2023 | 10:43 AM

ఇక పుష్కలంగా ఆహారం తీసుకునే ఈ చేపలు నీటిలోకి చేరితే ఈ సమస్య పెరిగి చేపల పెంపకం మరింత తగ్గిపోతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ చేప కేవలం మేత మాత్రమే కాదు.. ఇది మాంసాహార చేప కావడంతో తన కంటే చిన్నవైన ఇతర చేపల్ని సైతం మింగేస్తుంది. ఈ డేంజర్ ఫిష్ ప్రభావంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మత్స్యశాఖ అధికారులు స్పందించారు.

బాబోయ్‌ భయంకర చేప.. వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్‌..! వింతను చూసేందుకు ఎగబడ్డ జనాలు..
Suckermouth Catfish
Follow us on

చేపల్లో కొన్ని వింత జాతులున్నాయి. అన్ని చేపలు తినడానికి పనికిరావు. అలాంటిదే ఈ చేప కూడా. పశ్చిమ బెంగాల్‌లో ఓ మత్స్యకారుల వలలో వింతగా కనిపించే భయంకర చేప చిక్కింది. దిఘా సమీపంలోని రాంనగర్ తీర ప్రాంతంలో ఈ చేప కనిపించింది. ఆ వింత చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. అయితే, ఈ వింత చేపను షుగర్‌మౌత్ క్యాట్ ఫిష్ అంటారని తెలిసింది. దీని శాస్త్రీయ నామం హైపోస్టోమస్ ప్లెకోస్టోమస్. మన దేశంలోని కొన్ని చెరువులు, కాలువల్లో అప్పుడప్పుడు ఇలాంటి అరుదైన చేపలు కనిపిస్తాయి. వీటిని ప్లెకో లేదా ప్లెకోస్టోమస్ హైపోస్టోమస్ ప్లెకోస్టోమస్ అని కూడా పిలుస్తారు. అది ఉష్ణమండల మంచినీటి చేపగా అధికారులు గుర్తించారు.

బెంగాల్ తీరంలో వలలో చిక్కిన ఈ చేప వింతగా ఉండడంతో స్థానికులు దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. విదేశీ జాతుల చేపలను సాధారణంగా అక్వేరియంలో అలంకరణలుగా ఉంచుతారు.ఇవి ఫాస్ట్ బ్రీడింగ్ ఫిష్. ఈ జాతి చేపలు జలచరాలతో పాటు ఆల్గే, చిన్న చేపలు, చేపల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి.ఇంకా, షుగర్‌ మౌత్ ఫిష్ రెక్కలు చాలా పదునుగా ఉంటాయి. ఇతర చేపలు వాటి రెక్కల ద్వారా సులభంగా గాయపడతాయి. ఆ తర్వాత అవి కుళ్లిపోయి చనిపోతాయి. తూర్పు మేదినీపూర్ జిల్లాలోని రామనగర 1 బ్లాక్‌లోని పడిమ తీర ప్రాంతంలో సోమవారం ఈ చేప పట్టుబడింది. ఇప్పుడు ఈ వింత చేప ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.

షుగర్‌మౌత్ క్యాట్‌ఫిష్ స్థానికులు అనుకున్నంత భయానకం కాదు. కానీ ఇలాంటి చేపలు ఆహారం కోసం ఇతర చేపలను గాయపరుస్తుంది. కానీ ఇవి ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తింటాయి. అది కాకుండా ఇప్పటికే స్థానిక జాతుల చేపలకు ఆహార సరఫరా కోసం ఇప్పటికే తీవ్రమైన పోటీ ఉంది. పోటీ కారణంగా స్థానిక జాతుల చేపలు చనిపోతున్నాయి. ఇక పుష్కలంగా ఆహారం తీసుకునే ఈ చేపలు నీటిలోకి చేరితే ఈ సమస్య పెరిగి చేపల పెంపకం మరింత తగ్గిపోతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ చేప కేవలం మేత మాత్రమే కాదు.. ఇది మాంసాహార చేప కావడంతో తన కంటే చిన్నవైన ఇతర చేపల్ని సైతం మింగేస్తుంది. షుగర్ ఫిష్ ప్రభావంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మత్స్యశాఖ అధికారులు స్పందించారు. వీటిని సాధారణంగా అక్వేరియంలలో ఉంచుతారని.. ఎవరో నీటిలో వేసినట్లు కనిపిస్తోందని, ఈ చేపను చూసి భయపడాల్సిన అవసరం లేదని అధికారులు హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..