Viral News: కాళ్ల ఫోటోలు అమ్ముకుంటూ కోట్లు సంపాదించిన 32ఏళ్ల మహిళ..! స‌క్సెస్ స్టోరీ తెలిస్తే అవాక్కే..!!

ఇదిలా ఉండగా, ఆమె అభిమానుల నుండి ఆమెకు వింత డిమాండ్లు రావడం ప్రారంభించారు. వాటిని నెరవేర్చినట్టయితే.. భారీ మొత్తాలను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె తన అభిమానుల డిమాండ్లను నెరవేరుస్తుంది. పలువురికి మెసేజ్‌లు చేసేది. కొన్నిసార్లు ఫోన్‌లో కూడా మాట్లాడుతుంది.అలా ఆమె గత 2 సంవత్సరాల కాలంలోనే తన ఫోటోగ్రాఫ్‌లను అమ్మడం ద్వారా రూ.2 కోట్లకు పైగా సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది.

Viral News: కాళ్ల ఫోటోలు అమ్ముకుంటూ కోట్లు సంపాదించిన 32ఏళ్ల మహిళ..! స‌క్సెస్ స్టోరీ తెలిస్తే అవాక్కే..!!
Feet Photos
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 13, 2023 | 9:31 AM

పని చేయాలనే ఆలోచన, తపన ఉండేలే గానీ, చేసేందుకు వందలాది మార్గాలు ఉన్నాయి. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా సులభం. కానీ సంపాదించడానికి మార్గాలు కనుగొనడం కష్టం. మీ చుట్టూ అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారానే మీరు డబ్బు సంపాదించవచ్చు. వాటిని గుర్తించడానికి సమయం మాత్రమే కావాల్సింది. ఒక అమెరికన్ మహిళ తనకు వచ్చిన అవకాశాన్ని సకాలంలో గుర్తించి క్యాష్‌ చేసుకుంది. కేవలం 2 ఏళ్ల కాలంలోనే ఆమె లక్షాధికారి అయ్యింది. ఒక సాధారణ మనిషి సంపాదన కోసం జీవితాంతం శ్రమిస్తాడు.. కానీ, ఆమె దానిని ఒక నెలలో పూర్తి చేసింది. ఆమె తన పాదాల ఫోటోలను అమ్ముకోవటం ద్వారా లక్షల్లో డబ్బు సంపాదిస్తుంది. ఏంటీ షాక్‌ అవుతున్నారా..? కానీ, నిజమేనండోయ్.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నివేదిక ప్రకారం, క్రిస్సీ స్వీట్ అనే 32 ఏళ్ల మహిళ హెయిర్‌డ్రెస్సర్‌గా పనిచేస్తుంది. 2020లో ఆమె అమెరికా నుండి లండన్‌కు మారింది. అదే సమయంలో కోవిడ్‌ మహమ్మారి దెబ్బతో ఆమె వీలైనంత త్వరగా డబ్బు సంపాదించడానికి ప్రపంచంతో పోటీపడటం ప్రారంభించింది. ఆమె స్నేహితుల సలహా తీసుకుంది. ఆమె స్నేహితురాలు ఫన్ విత్ ఫీట్ అండ్ ఓన్లీ ఫ్యాన్స్ అనే సబ్‌స్క్రిప్షన్ సైట్‌లో కంటెంట్ క్రియేటర్‌గా పని చేస్తోంది. ఈ సైట్లలో ఆమె తన ప్రైవేట్ ఫోటోలు, పాదాల ఫోటోలను విక్రయించేది. ఇదే బిజినెస్‌ తనను కూడా చేయమని క్రిస్సీకి సూచించింది.

కోవిడ్‌-19 రెండో లాక్‌డౌన్‌ వరకు క్రిస్సీకి ఎలాంటి పని దొరకలేదు. దాంతో విసుగెత్తిపోయిన ఆమె.. తన ఫ్రెండ్‌ సలహా మేరకు..తను చెప్పిన సైట్‌లో అకౌంట్‌ క్రియేట్‌ చేయాలని నిర్ణయించుకుంది. ఫన్ విత్ ఫీట్ వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసింది. అందులో ఆమె పాదాల ఫోటోలను పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఆమె పాదాలను అలంకరించుకోవడానికి, పాదాలను అందంగా తీర్చిదిద్దుకోవడానికి పార్లర్‌కి వెళ్లేది. రకరకాల చెప్పులతో ఫోటోలు దిగి పోస్ట్ చేసేది. ఈ ఫోటోలకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. అలా ఆమె డబ్బు సంపాదించడం ప్రారంభించింది. ఆమె తన ఫొటోలను రూ.800 నుంచి రూ.20 వేలకు అమ్మేది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, ఆమె అభిమానుల నుండి ఆమెకు వింత డిమాండ్లు రావడం ప్రారంభించారు. వాటిని నెరవేర్చినట్టయితే.. భారీ మొత్తాలను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఒక అభిమాని వారి శుభ్రమైన పాదాల చిత్రాన్ని పంపమని కోరగా, మరొకరు వారి పాదాలను తాడుతో కట్టిన ఫోటోలు పంపమని అడిగారు. క్రిస్సీ పాదాలు బురద నీటిలో నడుస్తున్న వీడియోను చూసిన అభిమాని నుండి విచిత్రమైన అభ్యర్థన వచ్చింది. ఆమె తన అభిమానుల డిమాండ్లను నెరవేరుస్తుంది. పలువురికి మెసేజ్‌లు చేసేది. కొన్నిసార్లు ఫోన్‌లో కూడా మాట్లాడుతుంది. కానీ, ఆమె ఎప్పుడూ అభ్యంతరకరమైన ఫోటోలను షేర్‌ చేయదు. వీడియో కాల్‌లో కలవడానికి లేదా మాట్లాడటానికి కూడా ఇష్టపడదు. అలా ఆమె గత 2 సంవత్సరాల కాలంలోనే తన ఫోటోగ్రాఫ్‌లను అమ్మడం ద్వారా రూ.2 కోట్లకు పైగా సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!