Watch: అద్దంలా కనిపించే అరుదైన చేప.. తరతరాలుగా సముద్ర శాస్త్రవేత్తలను ఆకర్షిస్తూ..

|

Aug 09, 2023 | 1:02 PM

వీడియోలో మనం చేస్తున్న చేప పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది. దాన్ని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా శరీరం, ఒంట్లోని ఏ భాగం కనిపించటం లేదు.. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇది నిజంగా ప్రకృతి అద్భుతం అని కొందరు అంటుంటే.. వావ్.. ఇదంతా మాయా..! అని మరికొందరు అంటున్నారు. ప్రకృతి అద్భుతం ఇది అంటూ వర్ణిస్తున్నారు. మన కళ్లను మనమే నమ్మలేని అనేక జీవులు ఇక్కడ ఉన్నాయంటూ అవాక్కై చూస్తున్నారు..

Watch: అద్దంలా కనిపించే అరుదైన చేప.. తరతరాలుగా సముద్ర శాస్త్రవేత్తలను ఆకర్షిస్తూ..
Rare Transparent Fish
Follow us on

మన విభిన్న ప్రపంచంలో, అనేక మనోహరమైన జీవులు చాలా మందికి తెలియవు. ఉదాహరణకు, భారతదేశంలోని వ్యక్తులకు ఆఫ్రికన్ అడవులలో కనిపించే ఆశ్చర్యకరమైన జంతువుల గురించి తెలియకపోవచ్చు. ఆఫ్రికన్లు భారతదేశంలోని ప్రత్యేకమైన వన్యప్రాణులతో పరిచయం కలిగి ఉండకపోవచ్చు. కానీ, సోషల్ మీడియా రాకతో, ఈ విచిత్రమైన జీవుల ఆకర్షణీయమైన చిత్రాలు, వీడియోలు అనేకం బయటపడుతున్నాయి. ప్రకృతి అద్భుతమైన సృష్టి గురించి ఇలాంటి చిత్రాలు ప్రజలకు జ్ఞానోదయం చేస్తాయి. అలాంటి ఓ జీవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాంటిదే పారదర్శక చేపల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది వీక్షకులలో విపరీతమైన ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది.

ఈ క్లిప్ ఒక అరుదైన పారదర్శక చేప వీడియో వైరల్ అవుతోంది, అందులో దాని కళ్ళు తప్ప దాని అవయవాలు ఏవీ కనిపించవు. వీడియోలో ఒక వ్యక్తి తన చేతుల్లోని పారదర్శక చేపను కెమెరా వైపు చూపించటం కనిపించింది. ఈ చేప పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది. దాని కళ్ళు తప్ప, శరీరంలోని ఏ భాగం కనిపించటం లేదు. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రకృతి అద్భుతం ఇది అంటూ వర్ణిస్తున్నారు. మన కళ్లను మనమే నమ్మలేని అనేక జీవులు ఇక్కడ ఉన్నాయంటూ అవాక్కై చూస్తున్నారు..

ఇవి కూడా చదవండి

వీడియోలో మనం చేస్తున్న చేప పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది. దాన్ని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా శరీరం, ఒంట్లోని ఏ భాగం కనిపించటం లేదు.. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇది నిజంగా ప్రకృతి అద్భుతం అని కొందరు అంటుంటే.. వావ్.. ఇదంతా మాయా..! అని మరికొందరు అంటున్నారు. ఈ వీడియోను ట్విట్టర్ హ్యాండిల్ @ThebestFigen ఆగస్టు 1న పోస్ట్ చేసింది. దానికి క్యాప్షన్‌లో పారదర్శక చేప, కళ్ళు తప్ప మరే భాగం కనిపించదు అని రాశారు.

ఈ క్లిప్‌కి ఇప్పటికే 17 లక్షలకు పైగా వీక్షణలు, 40 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. వీడియో చూసిన చాలా మంది ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చారు. చేపల అవయవాలు కూడా పారదర్శకంగా ఉంటాయని కొందరు చెబుతుంటే…ఇది చాలా ఆసక్తికరంగా ఉందంటూ మరొకరు రాశారు. మరికొందరు ఫన్నీ కామెంట్స్‌ కూడా చేశారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి చేపను చూశారా?