Viral: బాలికకు మూడేళ్ల వయసు నుంచే పీరియడ్స్ – క్యాన్సర్ అనుకుని 14ఏళ్లు చికిత్స – చివరకు
మాములుగా యుక్త వయస్సు వచ్చినప్పుడు అమ్మాయిలకు రుతుస్రావం మొదలవుతుంది. కానీ ఆ చిన్నారికి మూడేళ్ల వయసులోనే ప్రారంభమైంది. శారీరకంగా పెరుగుదల కూడా మందగించింది. ఆ తర్వాత పాపకు 8 ఏళ్లు ఉన్నప్పుడు అండాశయంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. దాన్ని క్యాన్సర్ కణితిగా భావించి, అండాశయంలోని కొంత భాగాన్ని వైద్యులు రిమూవ్ చేశారు.

విస్మయం కలిగించేలా ఆ చిన్నారికి మూడేళ్ల వయస్సులోనే రుతుస్రావం ప్రారంభమయింది. ఆపై శారీరక పెరుగుదల ఆగిపోయింది. ఈ సమస్యతో బాధపడుతున్న ఆ బాలికకు 8 ఏళ్ల వయసులో అండాశయంలో కణితి కనిపించింది. క్యాన్సర్ అనుమానంతో డాక్టర్లు ఆ కణితిని తొలగించారు. అయితే, సమస్యలు కొనసాగుతూనే ఉండడంతో 17 ఏళ్ల వయసులో ఆమెను జైపుర్‌లోని జేకే లోన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు.. పలు రకాల వైద్య పరీక్షలు చేసి.. రిపోర్టులపై లోతైన విశ్లేషణ చేయగా ఈ కేసు ప్రత్యేకత వెలుగులోకి వచ్చింది. అప్పుడు బాలిక ‘వ్యాన్ విక్ అండ్ గ్రుంబాచ్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడం, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) అసాధారణంగా పెరగడం జరిగింది. TSH, ఫోలికుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH) చేసే పనిని చేస్తూ.. శరీరంలో అనేక అవాంఛిత మార్పులకు కారణమైంది.
నిరంతరం ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఈ బాలికకు ముందు ఎక్కడా థైరాయిడ్ టెస్ట్ చేయలేదు. దీని వల్ల వ్యాధి ఆలస్యంగా నిర్ధారణ అయ్యింది. బాలికకు సరైన చికిత్స అందిస్తూ.. డాక్టర్లు 15 రోజుల వైద్యం తర్వాత డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతోంది. వైద్య నిపుణుల ప్రకారం.. ఈ చికిత్సకు నెలకు వెయ్యి రూపాయల మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే, వ్యాధి నిర్ధారణ కాకపోవడం వల్ల బాలిక కుటుంబం గతంలో లక్షలాది రూపాయలు వృథా చేసినట్లు డాక్టర్లు వెల్లడించారు
ఇప్పుడు బాలికకు సరైన వైద్యం అందడంతో.. ఆమె శారీరకంగా సాధారణ స్థితికి చేరుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఆడబిడ్డకు కొత్త జీవనాన్ని అందించిన డాక్టర్లకు ఆ కుటుంబం వేల వేల వందనాలు చెబుతోంది. ఇప్పటివరకు ప్రపంచమంతటా 60 కంటే తక్కువ మందికే ‘వ్యాన్ విక్ అండ్ గ్రుంబాచ్ సిండ్రోమ్’ నిర్ధారణ అయిందని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
