Rare Cobra: ఆకట్టుకుంటున్న అరుదైన పాము.. శరీరంపై మూడు కళ్లజోడు గుర్తులు.. ఫొటోలు చూడండి..!

సెయింట్ జాన్సన్‌ కళాశాల జంతుశాస్త్ర మాజీ ఆచార్యులు ఆల్బర్ట్‌ రాజేంద్రన్‌ మాట్లాడుతూ.. ఇలాంటి గుర్తులతో కూడిన పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారు. ఇండియన్‌ రాక్‌ పైథాన్, రస్సెల్స్‌ వైపర్, వివిధ రకాల ఫిట్ వైపర్ల రకానికి చెందిన పాములు వాటి శరీరాలపై విలక్షణమైన మచ్చలతో ఉన్నా, బైనోసెల్లేట్ నమూనా కోబ్రాలకు ప్రత్యేకమైనదని, సాధారణంగా హుడ్‌కే పరిమితంగా ఉంటుందని ఆయన వివరించారు.

Rare Cobra: ఆకట్టుకుంటున్న అరుదైన పాము.. శరీరంపై మూడు కళ్లజోడు గుర్తులు.. ఫొటోలు చూడండి..!
Rare Cobra

Updated on: Jul 28, 2025 | 12:10 PM

ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల పాములు ఉన్నాయి. అందులో కొన్ని అత్యంత విషపూరితమైనవి, ప్రమాదకరమైన పాములు కూడా ఉన్నాయి. పాముల్లో కొన్ని అంత్యంత అరుదైనవి కూడా ఉన్నాయి. అలాంటి అరుదైన నాగు పాము ఒకటి తమిళనాడులో కనిపించింది. ఆ కోబ్రా శరీరంలోని వివిధ భాగాలపై ఒకటి, రెండు కాదు.. మూడు కళ్లజోడు గుర్తులను కలిగి ఉంది. ఈ ప్రత్యేకమైన పామును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అది మామూలు పాము కాదు అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

తమిళనాడులోని చెన్నైలోని తారామణి సెంట్రల్‌ పాలిటెక్నిక్‌ క్యాంపస్‌లో మూడు కళ్లజోడు (స్పెక్టకిల్‌) గుర్తులతో ఉన్న అరుదైన నాగుపాము కనిపించింది. వింతగా కనిపించిన ఈ పామును చెన్నై వన్యప్రాణుల సంరక్షణ విభాగ సిబ్బంది రక్షణ కల్పించారు. ప్రపంచ పాముల దినోత్సవం జులై 16వ తేదీన ఈ అరుదైన కింగ్‌ కోబ్రా కనిపించిందని క్యాంపస్‌ సిబ్బంది పేర్కొన్నారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది పామును పరిశీలించారు. సాధారణంగా భారతీయ కోబ్రా మీద కనిపించే ఈ గుర్తులు ఇక్కడ కనిపించిన నాగుపాము శరీరం మీద ఎక్కువగా కనిపించాయని చెప్పారు. తర్వాత నాగుపామును గిండిలోని చిల్డ్రన్స్‌ పార్కులో ఉన్న సర్పెంటారియంలోని ఎన్‌క్లోజర్‌కు మార్చారు.

నాగుపాము గురించి తిరునెల్వేలి హెర్పటాలజిస్ట్, సెయింట్ జాన్సన్‌ కళాశాల జంతుశాస్త్ర మాజీ ఆచార్యులు ఆల్బర్ట్‌ రాజేంద్రన్‌ మాట్లాడుతూ.. ఇలాంటి గుర్తులతో కూడిన పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పారు. ఇండియన్‌ రాక్‌ పైథాన్, రస్సెల్స్‌ వైపర్, వివిధ రకాల ఫిట్ వైపర్ల రకానికి చెందిన పాములు వాటి శరీరాలపై విలక్షణమైన మచ్చలతో ఉన్నా, బైనోసెల్లేట్ నమూనా కోబ్రాలకు ప్రత్యేకమైనదని, సాధారణంగా హుడ్‌కే పరిమితంగా ఉంటుందని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..