AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బిడ్డ ప్రాణం కోసం 8 నెలలుగా తండ్రి తపన.. కన్నీళ్లు పెట్టిస్తున్న రాపిడో రైడర్ గాథ!

కన్నబిడ్డ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఒక తండ్రి నిస్సహాయత, అచంచలమైన పోరాట పటిమకు సంబంధించిన హృదయవిదారక కథ సోషల్ మీడియాను కదిలిస్తోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌కు చెందిన ఒక రాపిడో బైక్ రైడర్ రోజువారీ జీవితమే ఇందుకు నిదర్శనం. ఆఫీసులో పని కాస్త ఎక్కువైతేనే అలిసిపోయే నేటి కాలంలో, గత 8 నెలలుగా కేవలం ఐదు గంటల నిద్రతోనే గడుపుతూ తన దివ్యాంగ బిడ్డ చికిత్స కోసం ఈ తండ్రి చేస్తున్న పోరాటం అందరి కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది.

Viral: బిడ్డ ప్రాణం కోసం 8 నెలలుగా తండ్రి తపన.. కన్నీళ్లు పెట్టిస్తున్న రాపిడో రైడర్ గాథ!
Rapido Rider Struggle Story
Balaraju Goud
|

Updated on: Jul 03, 2026 | 10:39 AM

Share

కన్నబిడ్డ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఒక తండ్రి నిస్సహాయత, అచంచలమైన పోరాట పటిమకు సంబంధించిన హృదయవిదారక కథ సోషల్ మీడియాను కదిలిస్తోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌కు చెందిన ఒక రాపిడో బైక్ రైడర్ రోజువారీ జీవితమే ఇందుకు నిదర్శనం. ఆఫీసులో పని కాస్త ఎక్కువైతేనే అలిసిపోయే నేటి కాలంలో, గత 8 నెలలుగా కేవలం ఐదు గంటల నిద్రతోనే గడుపుతూ తన దివ్యాంగ బిడ్డ చికిత్స కోసం ఈ తండ్రి చేస్తున్న పోరాటం అందరి కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది.

శిఖర్ అనే సోషల్ మీడియా యూజర్ రాపిడో బైక్ బుక్ చేసుకున్నప్పుడు ఈ కథ వెలుగులోకి వచ్చింది. రైడర్ వేగం చూసి శిఖర్ కారణం అడగ్గా.. తాను కూడా ఆఫీసుకు సమయానికి వెళ్లాలని సదరు రైడర్ బదులిచ్చాడు. ఆ మాట వెనుక ఉన్న కఠోర నిజం విన్న శిఖర్ నివ్వెరపోయాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో నెలకు రూ. 20,000 జీతానికి పని చేస్తున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న అతని కుటుంబంలో, ఒక బిడ్డ పుట్టుకతోనే దివ్యాంగుడు. ఆ బిడ్డ మందులు, చికిత్స కోసమే నెలకు రూ. 10,000 ఖర్చవుతుంది. అంటే జీతంలో సగం భాగం ఆసుపత్రికే సరిపోతోంది.

ఈ అదనపు ఖర్చులను తట్టుకోవడానికి అతను ఎంచుకున్న మార్గమే ఈ రాపిడో రైడింగ్. అతని రోజువారీ దినచర్య వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఉదయం 6 గంటలకే బైక్ వేసుకుని రోడ్డుపైకి వచ్చే అతను 9 గంటల వరకు రాపిడో నడుపుతాడు. ఆ వెంటనే 10 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు ఆఫీసు ఉద్యోగం చేస్తాడు. డ్యూటీ కాగానే విశ్రాంతి తీసుకోకుండా, రాత్రి 11 గంటల వరకు మళ్లీ రాపిడో రైడర్‌గా మారి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాడు. ఇన్ని కష్టాల మధ్య ఎప్పుడు నిద్రపోతారని అడగ్గా.. “గత 8 నెలలుగా 5 గంటల కంటే ఎక్కువ నిద్రపోలేదు, అంతా దేవుడి ఇష్టం” అని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.

ఎలాంటి ఆవేదన, ఫిర్యాదులు లేకుండా కుటుంబం కోసం పోరాడుతున్న ఈ ‘రియల్ హీరో’ కథ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతని నిబద్ధతకు చేతులెత్తి మొక్కుతున్నారు. భార్యాపిల్లల కోసం అతను పడుతున్న ఈ తపన ఏ ప్రార్థన కంటే తక్కువ కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!