Viral Video: మార్కెట్‌లో సరికొత్త పెళ్లి ఊరేంపు వాహనం.. జేసీబీలో వధూవరులు.. వీడియో వైరల్

|

Jun 15, 2023 | 9:05 PM

పెళ్లి వేదిక దగ్గరకు వధూవరుల ఎంట్రీ నుంచి వివాహం అనంతరం వధువుకి ఇచ్చే అప్పగింతలు వరకూ అన్ని భిన్నంగానే సాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అందరికంటే భిన్నంగా చేసి అందరినీ ఆకట్టుకుపోవాలనే కోరిక అధికంగా ఉండడమే. అయితే అందరికంటే భిన్నంగా ఏదైనా చేయాలనే కోరికతో చేసే పనులు కొంత ఇబ్బందికరంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Viral Video: మార్కెట్‌లో సరికొత్త పెళ్లి ఊరేంపు వాహనం.. జేసీబీలో వధూవరులు.. వీడియో వైరల్
Video Viral
Follow us on

పెళ్లి ముహర్తం పెట్టినప్పటి నుంచి వధూవరుల ఇళ్లల్లో సందడే సందడి. వివాహ వేడుక సమయంలో ఆహుతులు, అభిమానుల కోలాహలం గురించి ఎంత చెప్పినా తక్కువే. పెళ్లి వేడుక్కి సంబంధించిన అనేక రకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఫన్నీగా ఉండే వీడియోలను విపరీతంగా షేర్ చేస్తూ సందడి చేస్తారు. వివాహ వేడుక సమయంలో ఆచారాలకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో చర్చనీయాంశమైంది. ఈ వీడియో చూసి  అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్లు సినిమాల మాదిరిగా జరుగుతున్నాయి. పెళ్లి వేదిక దగ్గరకు వధూవరుల ఎంట్రీ నుంచి వివాహం అనంతరం వధువుకి ఇచ్చే అప్పగింతలు వరకూ అన్ని భిన్నంగానే సాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అందరికంటే భిన్నంగా చేసి అందరినీ ఆకట్టుకుపోవాలనే కోరిక అధికంగా ఉండడమే. అయితే అందరికంటే భిన్నంగా ఏదైనా చేయాలనే కోరికతో చేసే పనులు కొంత ఇబ్బందికరంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి వధువును డోలీలోనో, పల్లకిలో తీసుకుని వెళ్తున్నట్లుగా ఒక JCBలో కూర్చోబెట్టుకును తీసుకుని వెళ్తున్నాడు.  వధువు వరులను ఊరేగించి సమయంలో తీసుకుని వెళ్లే వాహనాలను ఎలా అలంకరిస్తారో అదే విధంగా ఈ జేసీబీని కూడా అలంకరించారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

మీడియా కథనాల ప్రకారం, ఈ వీడియో రాంచీకి చెందినది. కృష్ణ మహతో అనే వ్యక్తి  నవ వధువును పూలతో అలంకరించిన జేసీబీలో తీసుకెళ్తున్నాడు. ఈ వాహనాన్ని పూలతో అలంకరించి తన వివాహాన్ని విభిన్నంగా,  చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఇలా చేసి ఉండవచ్చని అంటున్నారు. జేసీబీ బకెట్‌పై మందపాటి పరుపులు వేసి దానిపై వధూవరులతో పాటు మరొక వ్యక్తి కూర్చుని ఉన్నారు.

ఈ వీడియో @Killer_007_A అనే ​​ఖాతా ద్వారా Twitterలో షేర్ చేశారు. వందలాది లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ పెళ్లి ఊరేగింపు మార్కెట్‌లో పూర్తిగా కొత్తది అని ఒకరు అంటే.. ఎవరూ నవ వధువుకు ఇలా వీడ్కోలు పలకరు అని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..